January 19, 2014

భగవద్గీత -- అథ త్రయోదశో‌உధ్యాయః --క్షేత్రక్షేత్రఙ్ఞవిభాగయోగో నామ --- 11 నుండి 20 వరకు శ్లోకాలు

భగవద్గీత -- అథ త్రయోదశో‌உధ్యాయః --క్షేత్రక్షేత్రఙ్ఞవిభాగయోగో నామ --- 11 నుండి 20 వరకు శ్లోకాలు

11 వ శ్లోకం 
మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ|
వివిక్తదేశసేవిత్వమరతిర్జనసంసది|| 


భావం
ఆధ్యాత్మికజ్ఞానమునందు నిత్యస్థితుడై యుండుట, తత్త్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడేయని ఎరుంగుట - ఇవియన్నియును జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి అన్యమైన దంతయు అజ్ఞానము.  

12 వ శ్లోకం 
అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్|
ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోऽన్యథా|| 


భావం
అనాదియైన పరబ్రహ్మయే తెలిసికొనదగినవాడు. అతనిని తెలిసికొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు చెప్పుచున్నాను. 

13 వ శ్లోకం
జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వామృతమశ్నుతే|

అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే|| 

భావం
ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్ర స్థితములై యున్నవి. అది సర్వత్రా వ్యాపించియున్నది. 

14 వ శ్లోకం
సర్వతః పాణిపాదం తత్సర్వతోऽక్షిశిరోముఖమ్|

సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి|| 

భావం
అతడు ఇంద్రియగ్రాహ్యవిషయములను అన్నింటిని ఎరిగినవాడు. కాని వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తిరహితుడైనను సమస్తజగత్తును భరించి పోషించువాడు. అతడు గుణాతీతుడయ్యును ప్రకృతి సంబంధమువలన గుణములను అనుభవించుచున్నాడు.

15 వ శ్లోకం 
సర్వేన్ద్రియగుణాభాసం సర్వేన్ద్రియవివర్జితమ్|

అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ|| 

భావం
చరాచారభూతములన్నింటికిని బాహ్యాభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును, చరాచరరూపుడును అతడే. అతిసూక్ష్మ రూపుడైనందున తెలిసికొన శక్యముకానివాడు, అతిదూరముగను, దగ్గరగను యున్నది.

16 వ శ్లోకం
బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ|

సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్|| 

భావం
పరమాత్మ ఆకాశమువలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణుడైయున్నను, సమస్తచరాచరప్రాణుల రూపములలో వేర్వేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే భూతములను భరించునదియును, హరించునదియు, కలిగించునదియు అయి ఉన్నది. 

17 వ శ్లోకం
అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్|

భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ|| 

భావం
ఆ పరబ్రహ్మ అన్నిజ్యోతులకును జ్యోతి మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలిసికొనదాగిన వాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే. సర్వప్రాణుల హృదయముల యందు ప్రకాశించుచున్నది అతడే. 

18 వ శ్లోకం 
జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే|

జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్|| 

భావం
ఇంతవరకును క్షేత్రమును గూర్చియు, జ్ఞానమును గూర్చియు, జ్ఞేయమును గురించియు సంక్షిప్తముగా వివరించితిని. ఈ తత్త్వమును సమగ్రముగా తెలిసికొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందుటకు అర్హుడగుచున్నాడు.

19 వ శ్లోకం 
ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః|

మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే|| 

భావం
ప్రకృతి, పురుషుడు, - అను ఈ రెండును అనాదియైన వనియు, రాగద్వేషాదివికారములును, త్రిగుణాత్మకములైన పదార్థములన్నియును ప్రకృతినుండియే ఉత్పన్నములైనవనియు తెలిసికొనుము.

20 వ శ్లోకం 
ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి|

వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసమ్భవాన్|| 

భావం
కార్యకారణములను ఉత్పన్నము  చేయుటలో ప్రకృతియే హేతువనియు, సుఖ దుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడినది.



No comments:

Post a Comment