January 19, 2014

భగవద్గీత -- అథ త్రయోదశో‌உధ్యాయః --క్షేత్రక్షేత్రఙ్ఞవిభాగయోగో నామ --- 21 నుండి 34 వరకు శ్లోకాలు

భగవద్గీత -- అథ త్రయోదశో‌உధ్యాయః --క్షేత్రక్షేత్రఙ్ఞవిభాగయోగో నామ --- 21 నుండి 34 వరకు శ్లోకాలు

కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే|
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే|| 

భావం 
పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతినుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించుచు. ఈ గుణసాంగత్యము వలన జీవాత్మయొక్క నీచోన్నత జన్మలు కలుగుచున్నవి. 

22 వ శ్లోకం 
పురుషః ప్రకృతిస్థో హి భుఙ్క్తే ప్రకృతిజాన్గుణాన్|
కారణం గుణసఙ్గోऽస్య సదసద్యోనిజన్మసు||

భావం 
ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే, అతడు సాక్షిభూతుడగుటవలన ఉపద్రష్టయనియు, యథార్థసమ్మతినిచ్చువాడగుట వలన అనుమంత అనియు, అన్నింటిని ధరించి, పోషించువాడు అగుటవలన భర్త అనియు, జీవరూపములో భోక్త అనియు, బ్రహ్మాదులకును స్వామి యగుటవలన మహేశ్వరుడు అనియు, పరమాత్మ అనియు చెప్పబడుచున్నాడు.

23 వ శ్లోకం 
ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః|
పరమాత్మేతి చాప్యుక్తో దేహేऽస్మిన్పురుషః పరః||

భావం 
ఈ విధముగా  పురుషునితత్త్వమును, గుణసహితమైన ప్రకృతితత్త్వమును తెలిసికొనినవాడు అన్ని విధములగు కర్తవ్యకర్మలను ఆచరించుచున్నప్పటికిని తిరిగి జన్మించడు. 

24 వ శ్లోకం
య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ|
సర్వథా వర్తమానోऽపి న స భూయోऽభిజాయతే||  

భావం 
కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగముద్వారా తమహృదయములయందు చూతురు. మరికొందరు జ్ఞాన యోగముద్వారాను, మరికొందరు కర్మయోగముచేతను ఆ పరమాత్మను దర్శింతురు.

25 వ శ్లోకం 
ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా|
అన్యే సాఙ్ఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే||

భావం 
కాని ఈ సాధనమార్గములను గూర్చి ఎరుగని మందబుద్ధులు తత్త్వజ్ఞానముగల ఇతరులనుండి విని, తదనుసారముగ ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణపరాయణులును మృత్యువును దాటుచున్నారు.

26 వ శ్లోకం
అన్యే త్వేవమజానన్తః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే|
తేऽపి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః||  

భావం 
ఓ అర్జునా ! ఆ స్థావరజంగమప్రాణులన్నియును క్షేత్ర - క్షేత్రజ్ఞ సంయోగము వలననే కలుగుచున్నవని గ్రహించుము.

27 వ శ్లోకం
యావత్సఞ్జాయతే కిఞ్చిత్సత్త్వం స్థావరజఙ్గమమ్|
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్తద్విద్ధి భరతర్షభ||  

భావం 
నశ్వరములైన చరాచరభూతముల యందు సమముగా స్థితుడైయున్న పరమేశ్వరుడు నాశరహితుడు, అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజముగా చూచువాడు. 

28 వ శ్లోకం 
సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్|
వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి|| 

భావం 
సమస్తప్రాణులయందును సమభావముతో నుండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మాహంతకుడు కాడు అనగా తనను తాను నాశము చేసికొనువాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందుచున్నాడు.

29 వ శ్లోకం 
సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్|
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్|| 

భావం 
సకలకర్మలు అన్ని విధములుగ ప్రకృతిద్వారానే జరుగుచున్నవనియు, ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు నిజముగ చూచువాడు. 

30 వ శ్లోకం
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః|
యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి||  

భావం 
వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నియును ఒకే పరమాత్మయందు స్థితమై యున్నవనియు, అట్లే అవి యన్నియును ఆ పరమాత్మ నుండియే విస్తరించు చున్నవనియు, ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే పరబ్రహ్మను పొందుచున్నాడు.

31 వ శ్లోకం 
యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి|
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సమ్పద్యతే తదా||

భావం 
ఓ అర్జునా ! నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటి కిని అనాది అగుటవలనను, నిర్గుణుడు అగుటవలనను ఎట్టి కర్మలకును కర్తకాడు. కనుక కర్మలచే అంటబడడు.  

32 వ శ్లోకం 
అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః|
శరీరస్థోऽపి కౌన్తేయ న కరోతి న లిప్యతే|| 

భావం 
సర్వత్ర వ్యాపించుయున్న ఆకాశము సూక్ష్మ మగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థితమైయున్నను ఆత్మ నిర్గుణమగుటవలన వాటి గుణదోషములును దానికంటవు. 

33 వ శ్లోకం
యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే|
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే||  

భావం 
అర్జునా ! ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశిత మొనర్చుచున్నట్లు, ఒకే ఆత్మ సర్వప్రాణులయందును స్థితమై, వాటినన్నింటిని ప్రకాశింప జేయుచున్నాడు.

34 వ శ్లోకం
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః|
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత|| 

భావం 
ఈ విధముగా క్షేత్ర - క్షేత్రజ్ఞుల మధ్యగల అంతరమును, కార్యసహిత ప్రకృతినుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు మోక్షమును పొందుచున్నారు. 

ఓం తత్సదితిశ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగో నామ త్రయోదశోధ్యాయః !! 


No comments:

Post a Comment