January 19, 2014

భగవద్గీత -- అథ త్రయోదశో‌உధ్యాయః --క్షేత్రక్షేత్రఙ్ఞవిభాగయోగో నామ --- 1 నుండి 10 వరకు శ్లోకాలు

భగవద్గీత -- అథ త్రయోదశో‌உధ్యాయః --క్షేత్రక్షేత్రఙ్ఞవిభాగయోగో నామ --- 1 నుండి 10 వరకు శ్లోకాలు

శ్రీభగవానువాచ |
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే |
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రఙ్ఞ ఇతి తద్విదః || 
భావం
శ్రీ భగవానుడు పలికెను - ఓ కౌంతేయా ! ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందురు. ఈ క్షేత్రమును గూర్చి ఎరింగిన వానిని క్షేత్రజ్ఞుడు అని తత్త్వజ్ఞులు తెలిపిరి.

2 వ శ్లోకం 
క్షేత్రఙ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత |
క్షేత్రక్షేత్రఙ్ఞయోర్ఙ్ఞానం యత్తజ్ఙ్ఞానం మతం మమ || 
భావం
ఓ అర్జునా ! అన్ని క్షేత్రములయందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలిసికొనుము. క్షేత్రక్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికారపురుషుల తత్త్వములను గూర్చి తెలిసికొనుటయే జ్ఞానము అని నా అభిప్రాయము. 

3 వ శ్లోకం 
తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ |
స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు ||
భావం
క్షేత్రమనగానేమి? అది యెట్లుండును? దాని వికారములు ఏవి? ఆ వికారములు దేనినుండి ఏర్పడినవి? అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు? అతని ప్రభావమేమి? ఆ వివరములను అన్నింటిని సంక్షిప్తముగా చెప్పెదము వినుము.  

వ శ్లోకం 
ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ |
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః || 
భావం
క్షేత్ర, క్షేత్రజ్ఞులతత్త్వములను గూర్చి ఋషులెల్లరును బహువిధములుగా చెప్పిరి, వివిధ వేదమంత్రములను వేర్వేరుగా తెల్పినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములు గూడ నిశ్చయాత్మకముగ సహేతుకముగ నిర్ణయించి చెప్పినవి.

వ శ్లోకం 
మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ |
ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః ||
భావం
క్షేత్ర, క్షేత్రజ్ఞులతత్త్వములను గూర్చి ఋషులెల్లరును బహువిధములుగా చెప్పిరి, వివిధ వేదమంత్రములను వేర్వేరుగా తెల్పినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములు గూడ నిశ్చయాత్మకముగ సహేతుకముగ నిర్ణయించి చెప్పినవి.

వ శ్లోకం 
ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః |
ఏతత్క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ || 
భావం
ఇచ్చ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూలశరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో గూడినదియే క్షేత్రము. 

వ శ్లోకం 
అమానిత్వమదంభిత్వమహింసా క్షాంతిరార్జవమ్ |
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః || 
భావం
తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట, డాంబికము లేకుండుట, అహింస, క్షమించుగుణము, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతరశుద్ధి, అంతఃకరణస్థిరత్వము, మనశ్శరీరేంద్రియముల నిగ్రహము.

వ శ్లోకం 
ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ |
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ || 
భావం
ఇందరియార్థములయందు వైరాగ్యము అహంకార రాహిత్యము, జన్మ, మృత్యు, ముసలితనము రోగాదుల యందు దుఃఖదోషములను దర్శించుట. 

వ శ్లోకం 
అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు |
నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు || 
భావం
భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగువానియందు మమతాసక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తుప్రాప్తివలన ఎత్తి మనోవికారములకును లోనుగాకుండుట, ఎల్లప్పుడును సమబుద్ధిని కలిగియుండుట  

10 వ శ్లోకం 
మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ |
వివిక్తదేశసేవిత్వమరతిర్జనసంసది || 
భావం
పరమేశ్వరుడైన నాయందు అనన్యయోగముద్వారా అవ్యభిచారిణిభక్తి కలిగియుండుట, ఏకాంతపవిత్రప్రదేశమున ప్రవృత్తి కలిగియుండుట, విషయాసక్తులైన జనులయెడ ప్రీతి లేకుండుట.


No comments:

Post a Comment