January 20, 2014

భగవద్గీత అథ చతుర్దశోऽధ్యాయః - గుణత్రయవిభాగయోగః 11 నుండి 27 శ్లోకాలు

భగవద్గీత అథ చతుర్దశోऽధ్యాయః - గుణత్రయవిభాగయోగః 11 నుండి 27 శ్లోకాలు 

సర్వద్వారేషు దేహేऽస్మిన్ప్రకాశ ఉపజాయతే|
జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్త్వమిత్యుత|| 
భావం
శరీరేంద్రియములయందును, అంతఃకరణమునందును చైతన్యము, వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్త్వగుణము వృద్ధి చెందినదని గ్రహింపుము. 

12 వ శ్లోకం 
లోభః ప్రవృత్తిరారమ్భః కర్మణామశమః స్పృహా|
రజస్యేతాని జాయన్తే వివృద్ధే భరతర్షభ||
భావం
ఓ అర్జునా ! రజోగుణము వృద్ధియైనప్పుడు లోభము, ప్రవృత్తి, (ప్రాపంచిక విషయములయందు ఆసక్తి) స్వార్థబుద్ధితో సకామభావముతో కర్మాచరణము, అశాంతి, విషయభోగములయందు లాలసమొదలగు గుణములు కలుగును.

13 వ శ్లోకం 
అప్రకాశోऽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ|
తమస్యేతాని జాయన్తే వివృద్ధే కురునన్దన|| 
భావం
ఓ అర్జునా ! తమోగుణము అధికమైనప్పుడు అంతః కరణమునందును. ఇంద్రియములయందును వివేకశక్తి నష్టమగును. కర్తవ్యకర్మలయందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహములు కలుగును.  

14 వ శ్లోకం 
యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్|
తదోత్తమవిదాం లోకానమలాన్ప్రతిపద్యతే|| 
భావం 
సత్త్వగుణము వృద్ధిచెందినపుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరెడి నిర్మలములైన స్వర్గాది పుణ్యలోకములను పొందును. 

15 వ శ్లోకం 
రజసి ప్రలయం గత్వా కర్మసఙ్గిషు జాయతే|
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే|| 
భావం
రజోగుణము వృద్ధిచెందినపుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధిచెందినప్పుడు మృతిచెందిన మానవుడు పశుపక్షికీటకాది నీచయోనులలో జన్మించుచున్నాడు. 

16 వ శ్లోకం 
కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్|
రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలమ్||
భావం 
శ్రేష్ఠములైన కర్మలను ఆచరించుటవలన సాత్త్వికఫలము అనగా సుఖము,జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మలఫలములు కలుగును. రాజసకర్మలకు ఫలము దుఃఖము. తామసకర్మలకు అజ్ఞానము ఫలము. 

17 వ శ్లోకం 
సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ|
ప్రమాదమోహౌ తమసో భవతోऽజ్ఞానమేవ చ|| 
భావం
సత్త్వగుణము వలన జ్ఞానమూ, రజోగుణమువలన లోభమూ, తమో గుణము వలన ప్రమాదమోహాదులూ, అజ్ఞానమూ తప్పక సంభవించును. 

18 వ శ్లోకం 
ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా మధ్యే తిష్ఠన్తి రాజసాః|
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛన్తి తామసాః|| 
భావం
సత్త్వగుణస్థితులు స్వర్గాది - ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణస్థితులైన పురుషులు మధ్య లోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాలస్యాదులయందు స్థితులైనవారు అధోగతిని పొందుదురు.

19 వ శ్లోకం 
నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి|
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోऽధిగచ్ఛతి|| 
భావం
ద్రష్టయైనవాడు గుణములే గుణములయందు వర్తించు చున్నవనియూ, త్రిగుణములు తప్ప వేఱుగా కర్తలు లేరనియూ తెలిసికొని, త్రిగుణములకు అతీతముగానున్న నా తత్త్వమును తెలిసికొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందుచున్నాడు.

20 వ శ్లోకం 
గుణానేతానతీత్య త్రీన్దేహీ దేహసముద్భవాన్|
జన్మమృత్యుజరాదుఃఖైర్విముక్తోऽమృతమశ్నుతే|| 
భావం 

అర్జునుడు పలికెను - ఓ ప్రభూ ! డద్ మూడు గుణములకును అతీతుడైనవాని లక్షణములెవ్వి? అతని లోకవ్యవహారరీతి యెట్లుండును? మనుష్యుడు త్రిగుణములను ఎట్లు అతిక్రమించును ? 

21 వ శ్లోకం 
అర్జున ఉవాచ|
కైర్లిఙ్గైస్త్రీన్గుణానేతానతీతో భవతి ప్రభో|
కిమాచారః కథం చైతాంస్త్రీన్గుణానతివర్తతే|| 
భావం

22 వ శ్లోకం 
శ్రీభగవానువాచ|
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాణ్డవ|
న ద్వేష్టి సమ్ప్రవృత్తాని న నివృత్తాని కాఙ్క్షతి|| 
భావం 
శ్రీ భగవానుడు పలికెను - ఓ పాండవా ! సత్త్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణకార్యరూపమైన మోహము, తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు - ప్రాప్తించనపుడు ఆశించడు. 

23 వ శ్లోకం 
ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే|
గుణా వర్తన్త ఇత్యేవం యోऽవతిష్ఠతి నేఙ్గతే|| 
భావం 
త్రిగుణములకును, వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏ మాత్రము చలింపక, త్రిగుణాతీతుడు, సాక్షివలె ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానందఘనపరమాత్మ యందు ఏకీభావస్థితుడై యుండును. ఈ స్థితినుండి ఎన్నడును చలింపడు.

24 వ శ్లోకం 
సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాఞ్చనః|
తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిన్దాత్మసంస్తుతిః|| 
భావం 
త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై యుండును. సుఖదుఃఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారముల యందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడింటియందును గ్రాహ్యత్యాజ్య భావములను కలిగియుండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియా ప్రియములకు గాని, నిందాస్తుతులకు గాని తొణకుడు. అనగా రెండింటి యందును సమస్థితిలోనే యుండును.

25 వ శ్లోకం 
మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః|
సర్వారమ్భపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే|| 
భావం
మానవమానములయందును, మిత్రులయందును, శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును, విధ్యుక్తకర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును ఐనవాడు త్రిగుణాతీతుడని చెప్పబడును. 

26 వ శ్లోకం 
మాం చ యోऽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే|
స గుణాన్సమతీత్యైతాన్బ్రహ్మభూయాయ కల్పతే|| 
భావం 
మానవమానములయందును, మిత్రులయందును, శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును, విధ్యుక్తకర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును ఐనవాడు త్రిగుణాతీతుడని చెప్పబడును.

27 వ శ్లోకం 
బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య చ|
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ|| 
భావం
ఏలనన అట్టి శాశ్వతపరబ్రహ్మకును, అమృతతత్వమునకును, సనాతన ధర్మమునకును, అఖండా నందమునకును నేనే ఆశ్రయుడను.  

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే  
గుణత్రయవిభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయః|| 



No comments:

Post a Comment