January 19, 2014

భగవద్గీత -- అథ ద్వాదశో‌உధ్యాయః -- భక్తియోగో నామః --- 1 నుండి 10 వరకు శ్లోకాలు:--

భగవద్గీత -- అథ ద్వాదశో‌உధ్యాయః -- భక్తియోగో నామః --- 1 నుండి 10 వరకు శ్లోకాలు


అర్జున ఉవాచ |
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే |
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః || 
భావం:-
అర్జునుడు పలికెను ఓ కృష్ణా ! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు, ధ్యానించుచు, పరమేశ్వరుడనైన నీ సగుణరూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవగు పరబ్రహ్మవైన నిన్ను అత్యంతభక్తిభావముతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులాలో అత్యుత్తమయోగులెవరు?

2  వ శ్లోకం
శ్రీభగవానువాచ |
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే |
శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః || 
భావం:-
శ్రీ భగవానుడు ఇట్లనెను - పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము నా భజనధ్యానాదుల యందే నిమగ్నులై, అత్యంతశ్రద్ధాభక్తులతో నన్ను ఆరాధించు భక్తులే యోగశ్రేష్టులని నా అభిప్రాయము

3  వ శ్లోకం
యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే |
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్ || 
భావం
ఎవరయితే, సర్వవాప్తి ఐనవాడును, మనసుకు, బుద్ధికి అందనివాడును, నిశ్చలుడు, నిత్యుడు, అయిన పరబ్రహ్మను ఉపాసింతురో.

4  వ శ్లోకం
సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః |
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః || 
భావం
వారు ఇంద్రియ  నిగ్రహం కలిగి సకల ప్రాణులకు హితము చేయుచు నన్నే పొందుదురు

5  వ శ్లోకం
క్లేశో‌உధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్ |
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ||
భావం
కాని పరబ్రహ్మమునందు ఆసక్తి గల చిత్తము గల్గిన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో గూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి అతికష్టముగా పొందబడుచున్నది. 

6  వ శ్లోకం
యే తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరాః |
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ||
భావం

7  వ శ్లోకం
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ |
భవామిన చిరాత్పార్థ మయ్యావేశితచేతసామ్ || 
భావం
ఓ అర్జునా ! నాయందే లగ్నమనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగనే మృత్యురూపసంసార సాగరము నుండి ఉద్దరింతును. 

8  వ శ్లోకం
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః || 
భావం

నా యందే మనస్సును నిలుపుము. నాయందే బుద్ధిని లగ్నము చేయుము. పిమ్మట నా యందే స్థిరముగానుందువు. ఇందు ఏ మాత్రమూ సందేహం అవసరం లేదు. 

9  వ శ్లోకం
అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ || 
భావం
మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడవు కానిచో అర్జునా ! అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు యత్నించు.

10  వ శ్లోకం
అభ్యాసే‌உప్యసమర్థో‌உసి మత్కర్మపరమో భవ |
మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి || 
భావం
అభ్యాసము చేయుటకును అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుట ద్వారా కూడ నీవు సిద్ధిని పొందగలవు. 



No comments:

Post a Comment