October 15, 2013

భగవద్గీత-- అథ ఏకాదశో‌உధ్యాయః --- విశ్వరూపదర్శనయోగః 51 నుండి 55 వరకు శ్లోకాలు:--

భగవద్గీత-- అథ ఏకాదశో‌உధ్యాయః --- విశ్వరూపదర్శనయోగః  51 నుండి 55 వరకు శ్లోకాలు

అర్జున ఉవాచ |
దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన |
ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః || 
భావం:--
అర్జునుడు పలికెను -- ఓ జనార్ధనా ! నీ అతిసౌమ్యమైన మానవాకృతిని (శ్యామసుందరరూపుని) చూచి, ఇప్పుడు నా మనసు కుదుటపడినది. నేను నా సహజ స్థితిని పొందితిని.     
52 వ శ్లోకం:-- 
శ్రీభగవానువాచ |
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ |
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః || 
భావం:--
శ్రీ భగవానుడు పలికెను -- నీవు చూచిన నా ఈ చతుర్భుజ రూపముయొక్క  దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము. దేవతల సహితము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవ్విళ్ళూరుచుందురు.   
53 వ శ్లోకం:-- 
నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా |
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా || 
భావం:--
నీవు గాంచిన నా చతుర్భుజ రూపమును దర్శించుటకు వేదపఠనములచే కానీ, తపశ్చర్యలచే గానీ, దానములచే గానీ యజ్ఞకర్మలచే గానీ శఖ్యము కాదు.  
54 వ శ్లోకం:-- 
భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధో‌உర్జున |
ఙ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప || 
భావం:--
కానీ ఓ పరంతపా ! అర్జునా ! ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును, తత్వజ్ఞానమును పొందుటకును అందు ఏకీభావస్థితి నొందుటకు కేవలము అనన్యభక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును.   
55 వ శ్లోకం:-- 
మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః |
నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ || 
భావం:--
అర్జునా ! కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నా యందు భక్తి శ్రద్ధలు కలవాడును, ప్రాపంచిక విషయములయందు ఆశక్తి లేనివాడును, ఏ ప్రాణియందును, ఏ మాత్రము వైరభావము లేనివాడును ఐన అనన్య (పరమ) భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు.       
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదేవిశ్వరూపదర్శనయోగో నామైకాదశో‌உధ్యాయః ||


No comments:

Post a Comment