October 15, 2013

భగవద్గీత-- అథ ఏకాదశో‌உధ్యాయః --- విశ్వరూపదర్శనయోగః 41 నుండి 50 వరకు శ్లోకాలు:--

భగవద్గీత-- అథ ఏకాదశో‌உధ్యాయః --- విశ్వరూపదర్శనయోగః  41 నుండి 50 వరకు శ్లోకాలు:--

41 & 42 శ్లోకాలు:--

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి |
అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ప్రణయేన వాపి ||

యచ్చావహాసార్థమసత్కృతో‌உసి విహారశయ్యాసనభోజనేషు |
ఏకో‌உథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయమ్ || 
భావం:--
నీ మహిమని తెలియని నిన్ను నా సఖునిగా భావించి, చనువుచేగాని, పొరపాటు వలనగాని, ఓ కృష్ణా ! ఓ యాదవా ! ఓ మిత్రా ! అనుచు తొందరపాటుతో ఆలోచింపక, నేను నిన్ను సంభోదించి ఉంటిని. ఓ అచ్యుతా ! విహారశయ్యాసన భోజనాది సమయములయందు ఏకాంతమునగాని, అన్యసఖుల సమక్షమునగాని సరసమునకై పరిహసాములాడి, నేను నిన్ను కించపరచి యుండవచ్చును, ఓ అప్రమేయ స్వరూపా ! నా అపరాధములనన్నింటిని క్షమింపుమని వేడుకొనుచున్నాను.          
43 వ శ్లోకం:--  
పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ |
న త్వత్సమో‌உస్త్యభ్యధికః కుతో‌உన్యో లోకత్రయే‌உప్యప్రతిమప్రభావ || 
భావం:--
ఓ అనుపమప్రభావా ! ఈ సమస్త చరాచరజగత్తునకును నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు. గురుడవు. సర్వశ్రేష్టుడవు. ఈ ముల్లోకములయందును నీతో సామానుడెవ్వడును లేదు. ఇంకా నీకంటె అధికుడెట్లుండును ?      
44 వ శ్లోకం:--  
తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ |
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ || 
భావం:--
కనుక ఓ ప్రభూ ! నా శరీరమును నీ పాదముల వద్ద ఉంచి, సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడవు ఐన నీవు నాయందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా ! కుమారుని తండ్రి క్షమించునట్లును, మిత్రుని ... మిత్రుడు క్షమించినట్లును, భార్యని భర్త క్షమించినట్లును, నా అపరాథములను నీవు క్షమింపుము.         
45 వ శ్లోకం:--  
అదృష్టపూర్వం హృషితో‌உస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే |
తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస || 
భావం:--
ఇంతకుముందు ఎన్నడును చూడని ఆశ్చర్య కరమైన ఈ రూపమును గాంచి, మిక్కిలి సంతసించితిని, కాని భయముచే నామనస్సు కలవరపాటు పొందింది. కనుక చతుర్భుజయుక్తుడవై విష్ణు రూపముతోడనే నాకు దర్శనమిమ్ము, ఓ దేవేశా ! జగన్నివాసా ! ప్రసన్నుడవు కమ్ము.       
46 వ శ్లోకం:--  
కిరీటినం గదినం చక్రహస్తమిచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ |
తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే || 
భావం:--
5కిరీటమును, గదను, శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహో ! విరాట్ రూపా ! నీ చతుర్భుజ రూపమును నాకు చూపుము.     
47 వ శ్లోకం:--  
శ్రీభగవానువాచ |
మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ |
తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ || 
భావం:--
శ్రీ భగవానుడు పలికెను---- ఓ అర్జునా ! నీపైగల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ - రూపమును ప్రదర్శించితిని, అది మిక్కిలి తేజోమయమైనది. అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకుముందు ఎవ్వరునూ చూచియుండలేదు.       
48 వ శ్లోకం:--  
న వేదయఙ్ఞాధ్యయనైర్న దానైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః |
ఏవంరూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ||
భావం:--
ఓ అర్జునా ! వేదాధ్యయనములచేగానీ, యజ్ఞాచరణములచేగానీ,  దానములచేగానీ , తీవ్రతపశ్చర్యలచేగానీ, తదితర పుణ్యకర్మలచేగానీ ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరిఎవ్వరికిని చూడసక్యము కాదు.
  
49 వ శ్లోకం:--  
మా తే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్ |
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య || 
భావం:--
ఈ విధమైన నా ఈ భయంకరరూపమును చూచి, నీవు ఎట్టి వ్యథకును, మొహమునకును గురికావలదు. భయమును వీడి, ప్రసన్నచిత్తుడై శంఖచక్రగదాపద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజరూపమును మరల చూడుము.      
50  వ శ్లోకం:--  
సంజయ ఉవాచ |
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః |
ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా || 
భావం:--
సంయుడు పలికెను -- వాసుదేవుడు ఈ విధంగా పలికి, అర్జునునకు తన చతుర్భుజ రూపమును దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణపరమాత్మ సౌమ్యమూర్తి ఐన తన కృష్ణస్వరూపమును స్వీకరించి, భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను.     

No comments:

Post a Comment