October 15, 2013

భగవద్గీత--అథదశమో‌உధ్యాయః---విభూతియోగః 31 నుండి 42 వరకు శ్లోకాలు

భగవద్గీత--అథదశమో‌உధ్యాయః---విభూతియోగః  31 నుండి 42 వరకు శ్లోకాలు:--

పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ |
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ || 

భావం:--
పవిత్రమొనర్చు వానిలో వాయువును నేను, శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను, మత్స్యములలో మొసలిని నేను, నదులలో గంగానదిని నేను.


32 వ శ్లోకం:--

సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున |
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ ||


భావం:--
ఓ అర్జునా ! సృష్టికి ఆదిమధ్యాంతములు నేను, విద్యలలో ఆధ్యాత్మవిద్యనూ అనగా బ్రహ్మవిద్యను నేను. పరస్పరవాదవివాదములలో తత్వ నిర్ణయమునకై చేయు వాదమును నేను. 

33 వ శ్లోకం:--

అక్షరాణామకారో‌உస్మి ద్వంద్వః సామాసికస్య చ |
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః ||


భావం:--
అక్షరములలో "ఆ" కారమును నేను, సమాసములలో "ద్వంద్వ" సమాసమును నేను, అక్షయకాలము అనగా మహాకాలమును నేను, అట్లే విశ్వతోముఖుడైన విరాట్పురుషుడను నేను, అందరిని ధరించువాడను, పోషించువాడను నేను.


34 వ శ్లోకం:--

మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ |
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా ||


భావం:--
అన్నిప్రాణులను హరించు మృత్యువును నేనే, సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే, స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా ధృతి, క్షమా అను వారందరును నేనే.


35 వ శ్లోకం:-- 

బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ |
మాసానాం మార్గశీర్షో‌உహమృతూనాం కుసుమాకరః ||

భావం:--
గానము చేయుటకు అనువైన శ్రుతులలో బృహత్సామమును నేను, ఛందస్సులలో గాయత్రీఛందస్సును నేను. మాసములలో మార్గశిరమును, ఋతువులలో వసంతఋతువును నేనే.

36 వ శ్లోకం:--

ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ |
జయో‌உస్మి వ్యవసాయో‌உస్మి సత్త్వం సత్త్వవతామహమ్ || 

భావం:--
పంచకులలో జానపదమును నేనే, ప్రభావసాలురలో ప్రభావమును నేనే, విజేతలలో జయమును నేనే, నిశ్చయాత్మకులలో నిశ్చయమును నేనే, సాత్వికపురుషులలో సాత్వికస్వభావమును నేనే.

37 వ శ్లోకం:---

వృష్ణీనాం వాసుదేవో‌உస్మి పాండవానాం ధనంజయః |
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః ||


భావం:--
వృష్ణివంశజులలో వాసుదేవుడను నేను, పాండవులలో ధనుంజయుడను నేనే, అనగా నీవే నేను, మునులలో వేదవ్యాసుడను, కవులలో శుక్రాచార్యుడను నేనే. 

38 వ శ్లోకం:---

దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ |
మౌనం చైవాస్మి గుహ్యానాం ఙ్ఞానం ఙ్ఞానవతామహమ్ ||


భావం:--
శిక్షించు వారిలో దమనశక్తిని నేనే, జయేచ్ఛకలవారి నీతిని నేనే, గోప్యవిషయరక్షణమున మౌనమును నేనే, జ్ఞానుల యొక్క తత్వజ్ఞానమును నేనే.


39 వ శ్లోకం:---

యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున |
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ ||


భావం:--
ఓ అర్జునా ! సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే, ఏలనన, నేనులేని చరాచరప్రాణి ఏదియూ లేదు.

40 వ శ్లోకం:--- 

నాంతో‌உస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప |
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా ||

భావం:--
ఓ పరంతపా ! నా దివ్యవిభూతులకు అంతమేలేదు. నా విభూతుల విస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తంగా వివరించితిని.


41 వ శ్లోకం:---

యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోం‌உశసంభవమ్ ||


భావం:--
విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము ఐన వస్తువేదైనను న తేజస్సు యొక్క అంశము నుండియే కలిగినదిగా తెలుసుకొనుము.


42 వ శ్లోకం:---

అథవా బహునైతేన కిం ఙ్ఞాతేన తవార్జున |
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్ ||

భావం:--
అథవా !ఓ అర్జునా ! ఇంతకంటెను విపులంగా తెలుసుకొని ప్రయోజనమేమి ? ఈ సంపూర్ణజగత్తును కేవలము నా యోగశక్తియొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను.


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
విభూతియోగో నామ దశమో‌உధ్యాయః ||


No comments:

Post a Comment