భగవద్గీత-- అథ ఏకాదశోஉధ్యాయః --- విశ్వరూపదర్శనయోగః 21 నుండి 30 వరకు శ్లోకాలు:--
అమీ హి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి |
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ||
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ||
భావం:--
ఇదిగో ! ఆ దేవతలెల్లరును నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయపడినవారై అంజలి ఘటించి, నీ నామ గుణములను కీర్తించుచున్నారు. మహర్షులను, సిద్ధులను స్వస్తివచనములతోడను, ఉత్తమోత్తముల తోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు.
22 వ శ్లోకం:--
రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా విశ్వేஉశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ |
గంధర్వయక్షాసురసిద్ధసంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే ||
గంధర్వయక్షాసురసిద్ధసంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే ||
భావం:--
ఏకాదశ రుద్రులను, ద్వాదశాదిత్యులను, అష్టవసువులును, సాధ్యులును, విశ్వదేవతలును, అశ్వినీకుమారులును, మరుద్గానములను, పితరులును అట్లే గంధర్వయక్షాసుర సిద్ధసముదాయములను సంభ్రమాశ్చర్యములతోనిన్నే దర్శించుచున్నాను.
23 వ శ్లోకం:--
రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదమ్ |
బహూదరం బహుదంష్ట్రాకరాలం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్ ||
బహూదరం బహుదంష్ట్రాకరాలం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్ ||
భావం:--
హే మహాబాహో ! అసంఖ్యాకములైనవస్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువు(తొడ)లను, కోరలను, కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి, అందరును భయకంపితులగుచున్నారు. నేను కూడా భయంతో వణికిపోవుచున్నాను.
24 వ శ్లోకం:--
నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో ||
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో ||
భావం:--
ఏలనన, హే విష్ణో ! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాలనేత్రములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యము సడలినది. శాంతి దూరమైనది.
25 వ శ్లోకం:--
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసంనిభాని |
దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస ||
దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస ||
భావం:--
ఓ జగన్నివాసా ! కరాళదంష్ట్రలతో (భయంకరములైన కోరలతో) ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్నిజ్వాలలవలె భీతిగొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కుతోచకున్నది. నెమ్మది(శాంతి) శూన్యమైనది. ఓ దేవేశా ! ప్రసన్నుడవు కమ్ము.
26 వ శ్లోకం:--
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః |
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః ||
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః ||
భావం:--
ఇచ్చట చేరియున్న ఈ ధృతరాష్ట్రపుత్రులు ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించు చున్నారు. భీష్మపితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధానయోధులు అందఱును.
27 వ శ్లోకం:--
వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాలాని భయానకాని |
కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ||
కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ||
భావం:--
భయంకరమైన కోరలతో గూడిన నీ ముఖములయందు అతివేగముగా పరుగులు దీయుచు ప్రవేశించుచున్నారు. కొందరి తలలు కోరల మధ్యబడి నుగ్గునుగ్గై పోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని కనిపించుచున్నారు.
28 వ శ్లోకం:--
యథా నదీనాం బహవోஉంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి |
తథా తవామీ నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి ||
తథా తవామీ నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి ||
భావం:--
అనేకములైన నదీనదములప్రవాహములన్నియును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు, ఈ శ్రేష్ఠులైన సమరయోధులు నరలోకవీరులు కూడా జ్వలించుచున్న నీకభిముఖులై ప్రవేశించుచున్నారు.
29 వ శ్లోకం:--
యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగాః |
తథైవ నాశాయ విశంతి లోకాస్తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ||
తథైవ నాశాయ విశంతి లోకాస్తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ||
భావం:--
మిడుతలన్నియును మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతివేగముగా పరుగెత్తి, తమ నాశనము కొఱకు అందు ప్రవేశించి, నశించునట్లు ఈ వీరులందఱును తమనాశమునకై అతివేగముగా పరుగెత్తి, నీ నోళ్ళయందు నాశముగోరి ప్రవేశించుచున్నారు.
30 వ శ్లోకం:--
లేలిహ్యసే గ్రసమానః సమంతాల్లోకాన్సమగ్రాన్వదనైర్జ్వలద్భిః |
తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ||
తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ||
భావం:--
హే విష్ణో ! ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్నివైపుల నుండి కబళించుచు మాటిమాటికిని చప్పరించుచున్నావు. నీ ఉగ్రతేజస్సులు సమస్తమైన జగత్తును తపింపజేయు చున్నవి.

No comments:
Post a Comment