భగవద్గీత--అథ నవమోஉధ్యాయః--రాజవిద్యారాజగుహ్యయోగః
31 నుండి 34 వరకు శ్లోకాలు.
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి |
కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి ||
భావం:--
కౌంతేయా ! అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును. శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా తెలుసుకొనుము.
32 వ శ్లోకం:--
మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేஉపి స్యుః పాపయోనయః |
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేஉపి యాంతి పరాం గతిమ్ ||
భావం:--
ఓ అర్జునా ! స్త్రీ, వైశ్య, శూద్రులును, అట్లే చండాలాది పాపయోనిజులును నన్నే శరణుపొంది పరమగతినే పొందుదురు.
33 వ శ్లోకం:--
కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్ ||
భావం:--
ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులును, రాజర్షులును భక్తులును నన్ను శరణుపొందినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనియేలేదు. ఈ మానవశరీరము క్షణభంగురము. సుఖరహితము, ఐనను దుర్లభము. కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజించి ముక్తుడవగుము.
34 వ శ్లోకం:--
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః ||
భావం:--
నా యందే నీ మనస్సును లగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము. నన్నే పూజింపుము. నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నా యందే నిలిపి, మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే
రాజవిద్యారాజగుహ్యయోగో నామ నవమోஉధ్యాయః|

No comments:
Post a Comment