September 2, 2013

భగవద్గీత---అథ సప్తమో‌உధ్యాయః--ఙ్ఞానవిఙ్ఞానయోగః 21 నుండి 30 శ్లోకాలు

భగవద్గీత---అథ సప్తమో‌உధ్యాయః--ఙ్ఞానవిఙ్ఞానయోగః
21
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి |
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ || 
భావం:--
ఏ భక్తుడు ఏ దేవతామూర్తిని పూజించకోరుతున్నాడో, అతనికి ఆ దేవతామూర్తి పట్ల అచంచలమైన శ్రద్ధ నేను కలగజేస్తాను.
22
స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే |
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్ || 
భావం:--
అలాంటి శ్రద్ధాభక్తులతో ఆ దేవతామూర్తిని ఆరాధించినవాడు నేను కలగజేసే కామితార్థాలనే ఆ దేవతద్వారా పొందుతున్నాడు.
23
అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ |
దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి || 
భావం:--
మందబుద్ధులైన ఈ మానవులు పొందే ఫలితాలు అశాశ్వతాలు. దేవతలను అర్చించేవాళ్ళు దేవతలనే పొందుతారు; నా భక్తులు మాత్రం నన్ను పొందుతారు.
24
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః |
పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ || 
భావం:--
అవివేకులు శాశ్వతం, సర్వోత్తమం అయిన నా స్వరూపాన్ని గుర్తించలేక నన్ను మానవమాత్రుడిగా తలుస్తారు.
25
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః |
మూఢో௨యం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ || 
భావం:--
యోగమాయచేత కప్పబడివున్న నేను అందరికీ కనబడడం లేదు. మూఢప్రపంచం నన్ను పుట్టుక, నాశనం లేనివాడిగా తెలుసుకోలేకపోతున్నది.
26 వ శ్లోకం:--
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున |
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన || 
భావం:--
భరతవంశీ ! ఓ అర్జునా ! జగత్తునందు ప్రాణులన్నియును రాగద్వేషముల వలన కలిగిన సుఖదుఃఖాదిద్వంద్వముల ప్రభావము వలన అంతులేని మోహములో పడిపోవుచున్నవి.
27
ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత |
సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప || 
భావం:--
పరంతపా ! సమస్త భూతాలు పుట్టుకతోనే అనురాగ ద్వేషాలమూలంగా కలిగే సుఖదుఃఖాలవల్ల మోహంలో మునిగి, అజ్ఞానంలో పడుతున్నాయి.
28 వ శ్లోకం:--
యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ |
తే ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః || 
భావం:--
కాని నిష్కామభావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు నశించును అట్టివారు రాగద్వేషజనితములైన సుఖదుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు. ధృఢనిశ్చయము గల్గిన అట్టి భక్తులు అన్నివిధముల నన్నే భజింతురు.
29 వ శ్లోకం:--
జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే |
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ ||
భావం:--
నన్ను శరణుపొంది జరామరణవిముక్తికై ప్రయత్నించు వారు ఆ పరబ్రహ్మను, సంపూర్ణ - ఆధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలిసికొందురు.
30 వ శ్లోకం:--
సాధిభూతాధిదైవం మాం సాధియఙ్ఞం చ యే విదుః |
ప్రయాణకాలే‌உపి చ మాం తే విదుర్యుక్తచేతసః || 
భావం:--
అధిభూత, అధిదైవ, అధియజ్ఞములతోపాటు అందరికినీ ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలిసికొనువారు నిశ్చలబుద్ధితో నన్నే చేరుదురు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

No comments:

Post a Comment