భగవద్గీత--అథ షష్ఠోஉధ్యాయః--41 నుండి 47 శ్లోకాలు--ఆత్మసంయమయోగః......
ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః |
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోஉభిజాయతే ||
భావం:--
యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది - ఉత్తమ లోకములను పొంది, ఆయాలోకములలో పెక్కు సంవత్సరములు గడిపిన తర్వాత పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును.
42 వ శ్లోకం:--
అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ |
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ||
భావం:--
లేనిచో విరాగియైన పురుషుడు ఆపుణ్య లోకములకు పోకుండగనే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును. కాని లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము గదా.
43 వ శ్లోకం:--
తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ |
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన ||
భావం:--
అచట యోగి కుటుంబమున పుట్టిన పిదప పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధిరూపయోగ సంస్కారములను అతడు సులభముగనే పొందును. ఓ కురునందనా ! ఆబుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరల పరమాత్మప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటెను అధికముగా సాధన చేయుచున్నాడు.
44 వ శ్లోకం:--
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోஉపి సః |
జిఙ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ||
భావం:--
శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వసాధనప్రభావమున నిస్సందేహముగ భగవంతునివైపు ఆకర్షితుడగును. అట్లే సమబుద్ధిరూపయోగ జిజ్ఞాసువుగూడ వేదములలో తెల్పబడిన సకామకర్మల ఫలమును అతిక్రమించును గదా !.
45 వ శ్లోకం:--
ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః |
అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్ ||
భావం:--
కాని, ప్రయత్నపూర్వకముగ యోగసాధనచేయు యోగి అనేక జన్మలసంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది, సంపూర్ణముగా పాపరహితుడై, తత్ క్షణమే పరమ పదమును పొందును.
46 వ శ్లోకం:--
తపస్విభ్యోஉధికో యోగీ ఙ్ఞానిభ్యోஉపి మతోஉధికః |
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ||
భావం:--
యోగితాపసులకంటెను శ్రేష్ఠుడు. జ్ఞానుల కంటెను శ్రేష్ఠుడు.సకామకర్మలను ఆచరించువారికంటెను శ్రేష్ఠుడని భావింపబడును. కావున ఓ అర్జునా ! నీవు యోగివి కమ్ము.
47 వ శ్లోకం:--
యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా |
శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః ||
భావం:--
యోగులందరిలోను శ్రద్ధాళువై, అంతరాత్మను నాయందే లగ్నమొనర్చి, అనగా భక్తివిశ్వాసములతో నిశ్చలమైన, దృఢమైన అనన్య భావముతో నా యందే స్థిరమైయున్న మనోబుద్ధిరూప అంతఃకరణమును గలిగి, నిరంతరము నన్నే భజించువాడు ఉత్తముడు అని నా యభిప్రాయము.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
ఆత్మసంయమయోగో నామ షష్ఠోஉధ్యాయః ||

No comments:
Post a Comment