భగవద్గీత---అథ అష్టమోஉధ్యాయః--అక్షరబ్రహ్మయోగః 21 నుండి 28 వరకు శ్లోకాలు
అవ్యక్తోஉక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్ |
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ ||
భావం:--
ఈ అవ్యక్తమనే అక్షరము అనియు అందురు. ఇదియే పరమగతి అనియు అందురు. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరినవారు మరల తిరిగిరారు.
22 వ శ్లోకం:--
పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా |
యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ||
భావం:--
ఓ పార్థా ! సమస్త ప్రాణులు ఆపరమాత్మ యందె అంతర్గతములై యున్నవి. ఆ పరమాత్మచేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్యభక్తి ద్వారా మాత్రమే లభ్యముకాగలడు.
23 వ శ్లోకం:--
యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః |
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ ||
భావం:--
ఓ భారతశ్రేష్ఠా ! ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగిరాని గతిని చేరుదురో, మఱియు ఏకాలమునందు దేహత్యాగము చేసినవారు తిరిగివచ్చు గతిని పొందుదురో అటువంటి కాలములను, అనగా రెండు మార్గములను చెప్పుచున్నాను.
24 వ శ్లోకం:--
అగ్నిర్జోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ |
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ||
భావం:--
బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయమార్గము ద్వారా బ్రహ్మపదప్రాప్తి నుందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమక్రమముగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి, పరమపదమును చేర్చుదురు.
25 వ శ్లోకం:--
ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ |
తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే ||
భావం:--
అట్లే సకామకర్మయోగులు ధూమ్రమార్గముద్వారా స్వర్గాదిలోకములను చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ కర్మయోగులను క్రమక్రమముగా రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన - అభిమానదేవతలు కొనిపోయి, స్వర్గాదిలోకములను చేర్చుదురు. వారు అచట చాంద్రమసజ్యోతిని పొంది, అనగా తమశుభకర్మ ఫలములను అనుభవించి, తిరిగి పునర్జన్మ నెత్తుచున్నారు.
26 వ శ్లోకం:--
శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే |
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః ||
భావం:--
ఈ రెండు మార్గములకును శుక్ల, కృష్ణమార్గములనియు వ్యవహారము గలదు. ఇవి సనాతనములు, శుక్లమార్గమున వెళ్లువారు పరమగతిని పొంది తిరిగిరారు. కృష్ణమార్గమున వెళ్లువారు తిరిగివచ్చి జననమరణచక్రములో పడుదురు.
27 వ శ్లోకం:--
నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన |
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ||
భావం:--
పార్థా ! ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్త్వములను తెలిసికొన్నయోగి మోహమునపడడు. కావున అన్నికాలముల యందును నీవు యోగివి కమ్ము.
28 వ శ్లోకం:--
వేదేషు యఙ్ఞేషు తపఃసు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |
అత్యేతి తత్సర్వమిదం విదిత్వాయోగీ పరం స్థానముపైతి చాద్యమ్ ||
భావం:--
ఈ తత్త్వరహస్యమును ఎరిగిన యోగి వేదపఠనము వలనను, యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును మించి నిస్సందేహముగా ఉత్కృష్టమైన బ్రహ్మపదమును పొందుచున్నాడు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
అక్షరబ్రహ్మయోగో నామాష్టమోஉధ్యాయః ||

No comments:
Post a Comment