భగవద్గీత--అథ నవమోஉధ్యాయః---రాజవిద్యారాజగుహ్యయోగః 1 నుండి 10 వరకు శ్లోకాలు.
శ్రీభగవానువాచ |
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే |
ఙ్ఞానం విఙ్ఞానసహితం యజ్ఙ్ఞాత్వా మోక్ష్యసేஉశుభాత్ ||
భావం:--
శ్రీ భగవానుడు ఇట్లు పలికెను - ఓ అర్జునా ! నీవు దోషదృష్టిలేని భక్తుడవు. కనుక నీకు రహస్యమైన జ్ఞానమును మరల వివరముగా చెప్పుచున్నాను. దీనిని తెలిసికొని నీవు ఈ దుఃఖరూపసంసారము నుండి ముక్తుడవు కాగలవు.
2 వ శ్లోకం:--
రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ||
భావం:--
ఈ బ్రహ్మజ్ఞానము విద్యలకు తలమానికము. సమస్త గోప్యవిషయములకును శిరోభూషణము. అతి పవిత్రము. ఉత్తమోత్తమము. ప్రత్యక్షఫలదాయకము. ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సులువైనది.
3 వ శ్లోకం:--
అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప |
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని || |
భావం:--
ఓ పరంతపా ! ఈ ధర్మమార్గము నందు విశ్వాసములేని పురుషులు నన్ను పొందజాలరు. కనుక వారు మృత్యురూప సంసారమునందు మళ్ళి మళ్ళి పడుచున్నారు.
4 వ శ్లోకం:--
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |
మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ||
భావం:--
నిరాకారపరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును వ్యాపించబడియున్నది. ప్రాణులన్నియును నా యందే యున్నవి. కాని వాస్తవముగా నేను వాటియందు లేను.
5 వ శ్లోకం:--
న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ |
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః ||
భావం:--
ఈ ప్రాణులన్నియును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములనన్నింటిని సృష్టించునదియు, పోషించునదియు నేనేయైనను యథార్థముగా నా ఆత్మ భూతముల యందు ఉండునది గాదు.
6 వ శ్లోకం:--
యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్ |
తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ ||
భావం:--
ఆకాశము నుండి ఉత్పన్నమైన, సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై యుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు (ప్రాణులు) అన్నియును నాయందే ఉన్నవని గ్రహించుము.
7 వ శ్లోకం:--
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ |
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ||
భావం:--
ఓ కౌంతేయా ! కల్పాంతము నందు భూతములన్నియును నా ప్రకృతినే చేరును. అనగా ప్రకృతిలో లీనమగును. సృష్టిఆరంభమున నేను మరల వాటిని సృజించుచుందును.
8 వ శ్లోకం:--
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్ ||
భావం:--
తమతమ స్వభావశమున పరతంత్రమైయున్న భూత సముదాయమును నాప్రకృతినాశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము మరల మరల పుట్టించుచున్నాను.
9 వ శ్లోకం:--
న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ |
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు ||
భావం:--
ఓ అర్జునా ! ఆ సృష్ట్యాది కర్మలయందు సంగములేక ఉదాసీనునివలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు.
10 వ శ్లోకం:--
మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ |
హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే ||
భావం:--
ఓ అర్జునా ! సాక్షిభూతుడనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచరజగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలననే జగత్తు పరిభ్రమించుచున్నది.

No comments:
Post a Comment