September 2, 2013

భగవద్గీత---అథ అష్టమో‌உధ్యాయః--అక్షరబ్రహ్మయోగః 11 నుండి 20 శ్లోకాలు

భగవద్గీత---అథ అష్టమో‌உధ్యాయః--అక్షరబ్రహ్మయోగః  11 నుండి 20 శ్లోకాలు

యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః |
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే || 

భావం:--
వేదవిదులైన విద్వాంసులు ఆ పరమాత్మను శాశ్వతుడు అని ప్రస్తుతింతురు - ఆసక్తిరహితులై యత్నశీలురైన సన్న్యాసులు ఆ పరమపదము నందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్యవ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును గూర్చి సంగ్రహముగా నేను నీకు వివరింతును.


12 & 13 వ శ్లోకాలు:--
సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ |
మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్ ||

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ |
యః ప్రయాతి త్యజందేహం స యాతి పరమాం గతిమ్ || 


భావం:-- 
సర్వేంద్రియములను నిగ్రహించి, మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి, అట్లు వశమైన మనస్సుద్వారా ప్రాణములను సహస్రారమునందు స్థిరమొనర్చి, పరమాత్మధ్యానమునందే నిమగ్నుడై,అక్షర బ్రహ్మస్వరూపుడైన ఓంకారమును ఉచ్చరించుచు, ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడను, నిర్గుణబ్రహ్మను ఐన నన్ను చింతించుచు దేహత్యాగమొనర్చువాడు పరమగతిని (మోక్షమును) పొందును. 



14 వ శ్లోకం:-- 
అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః |
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః || 


భావం:-- 
పార్థాః ! నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే నిలిపి, పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు, సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను. అనగా అతనికి నేను సులభముగా లభింతును. 


15 వ శ్లోకం:-- 
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ |
నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః || 


భావం:-- 
పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన, క్షణభంగురమైన పునర్జన్మను తిరిగి పొందురు.


16 వ శ్లోకం:--
ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినో‌உర్జున |
మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే || 

భావం:--
అర్జునా ! బ్రహ్మలోకపర్యంతము ఉన్న సమస్తలోకములును పునరావృత్తములు. కౌంతేయా ! కనుక నన్ను చేరినవానికి పునర్జన్మ లేదు.

17 వ శ్లోకం:--
సహస్రయుగపర్యంతమహర్యద్బ్రహ్మణో విదుః |
రాత్రిం యుగసహస్రాంతాం తే‌உహోరాత్రవిదో జనాః ||


భావం:-- 

వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు, అదే కాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రియనియు తెలిసిన యోగులు కాలతత్త్వమును నిజముగా ఎరిగినవారు.

18 వ శ్లోకం:-- 
అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే |
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంఙ్ఞకే || 

భావం:-- 
చరాచర ప్రాణులన్నియును బ్రహ్మయొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి (బ్రహ్మయొక్క సూక్ష్మశరీరము నుండి) ఉత్పన్నములగును. మరల బ్రహ్మయొక్క రాత్రికాలము ప్రారంభసమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును.

19 వ శ్లోకం:-- 
భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే‌உవశః పార్థ ప్రభవత్యహరాగమే || 

భావం:-- 
పార్థా ! ఈ ప్రాణి సముదాయము ప్రకృతివశమున మాటిమాటికిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభకాలమున లీనమగుచుండును. పగటి ప్రారంభ కాలమున పుట్టుచుండును. 

20 వ శ్లోకం:-- 
పరస్తస్మాత్తు భావో‌உన్యో‌உవ్యక్తో‌உవ్యక్తాత్సనాతనః |
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి || 

భావం:-- 
ఆ అవ్యక్తముకంటెను పరమైన విలక్షణమైన సనాతమైన అవ్యక్తభావమే ఆ పరమపదము. ప్రాణులన్నియు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు.(నిత్యుడే) 




No comments:

Post a Comment