భగవద్గీత--అథదశమోஉధ్యాయః---విభూతియోగః
11 నుండి 20 వరకు శ్లోకాలు
తేషామేవానుకంపార్థమహమఙ్ఞానజం తమః |
నాశయామ్యాత్మభావస్థో ఙ్ఞానదీపేన భాస్వతా ||
భావం:--
ఓ అర్జునా ! వారి యంతః కరణముల యందు స్థితుడనై యున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్త్వజ్ఞానరూప దీపమును (జ్యోతిని) వెలిగించి, వారి అజ్ఞానాంధకారమును పోగొట్టుచున్నాను.
12 వ శ్లోకం:--
అర్జున ఉవాచ |
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ |
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ ||
భావం:--
అర్జునుడు పలికెను - నీవు పరబ్రహ్మవు. పరంధాముడవు. పరమపవిత్రుడవు. మహర్షులు నిన్ను శాశ్వతుడవు, దివ్యమైనవాడవు, ఆదిదేవుడు, వ్యాసుడు,ప్రభువుగను పల్కెను.
13 వ శ్లోకం:--
ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా |
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ||
భావం:--
దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసమహర్షియు, సుత్తింతురు. నీవును నాకు ఆ విధముగనే చెప్పుచుంటివి.
14 వ శ్లోకం:--
సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |
న హి తే భగవన్వ్యక్తిం విదుర్దేవా న దానవాః ||
భావం:--
ఓ కేశవా ! నీవు చెప్పుచున్నది అంతయును సత్యమే. హే భగవాన్ ! నీ లీలామయస్వరూపమును దేవతలు గాని దానవులు గాని తెలియలేరు.
15 వ శ్లోకం:--
స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ |
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ||
భావం:--
ఓ జగదుత్పత్తికారకా ! ఓ సర్వభూతేశా ! ఓ దేవాదిదేవా ! ఓ జగన్నాథా ! ఓ పురుషోత్తమా ! నీ తత్త్వమును నీవే ఎరుగుదువు.
16 వ శ్లోకం:--
వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః |
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ||
భావం:--
సమస్తలోకములయందును నీ దివ్యవిభూతుల ద్వారా వ్యాపించి, స్థితుడవై యున్నాను. మహామహితములైన ఆ దివ్యవిభూతులను సంపూర్ణముగా తెల్పుటకు నీవే తగుదువు.
17 వ శ్లోకం:--
కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచింతయన్ |
కేషు కేషు చ భావేషు చింత్యోஉసి భగవన్మయా ||
భావం:--
ఓ యోగీశ్వరా ! నిరంతరము చింతనచేయుచూ నినన్ను ఏ విధముగా తెలిసికొనగలను? హే భగవన్ ! ఏ యే భావములతో నా ద్వారా చింతన చేయదగినవాడవు ? నిన్ను నేను ఎట్లు ధ్యానింపవలెను.
18 వ శ్లోకం:--
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన |
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేஉమృతమ్ ||
భావం:--
ఓ జనార్ధనా! నీ యోగశక్తిని గూర్చియు, నీ విభూతి వైభవములను గురించియు విస్తృతముగా ఇంకను తెలుపుము. ఏలనన నీ అమృతమయవచనములను ఎంతగా విన్నను తనివితీరకున్నది.
19 వ శ్లోకం:--
శ్రీభగవానువాచ |
హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః |
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే ||
భావం:--
శ్రీభగవానుడు పలికెను ఓ అర్జునా! నీవు లెస్సగా పలికితివి. నా దివ్యవిభూతుల విస్తృతికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు చెప్పెదను.
20 వ శ్లోకం:--
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ||
భావం:--
ఓ అర్జునా ! సమస్తప్రాణులహృదయములయందున్న ఆత్మను నేనే. సకల భూతముల ఆదియు, మధ్యస్థితియు అంతము నేనే.

No comments:
Post a Comment