11 శ్లోకం:--
బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ |
ధర్మావిరుద్ధో భూతేషు కామోஉస్మి భరతర్షభ ||
భావం:--
ధర్మావిరుద్ధో భూతేషు కామోஉస్మి భరతర్షభ ||
భావం:--
బలవంతులలోని ఆశ, అనురాగం లేని బలాన్ని నేను. ప్రాణులలోని ధర్మవిరుద్ధం కాని కామాన్నీ నేనే.
12
యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే |
మత్త ఏవేతి తాన్ విద్ధి న త్వహం తేషు తే మయి ||
భావం:--
సాత్త్విక, రాజసిక, తామసిక భావాలన్నీ నా వల్లనే కలిగాయని తెలుసుకో. వాటిలో నేను లేను; నాలో అవి వున్నాయి.
13
త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ |
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ ||
భావం:--
ఈ మూడుగుణాల ప్రభావంవల్ల ప్రపంచమంతా భ్రమచెంది, వాటికంటే విలక్షణుడిగా, వినాశం లేనివాడిగా నన్ను గ్రహించలేక పోతున్నది.
14
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ||
భావం:--
త్రిగుణస్వరూపమైన ఈ నా దైవమాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించినవాళ్ళు దానిని అతిక్రమిస్తారు.
15
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః |
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః ||
భావం:--
పాపాత్ములు, మూఢులు, మానవాధములు, మాయలోపడి వివేకం కోల్పోయినవాళ్ళు, రాక్షసభావాలను ఆశ్రయించినవాళ్ళు నన్ను పొందలేరు.
16 శ్లోకం:--
చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో௨ర్జున |
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ||
భావం:--
అర్జునా ! నన్ను సేవించే పుణ్యపురుషులు నాలుగు రకాలు—ఆపదలో వున్నవాడు, ఆత్మతత్త్వం తెలుసుకో గోరేవాడు, సిరిసంపదలు కోరేవాడు, ఆత్మజ్ఞానం కలిగినవాడు.
17
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే |
ఈ చతుర్విధభక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై, అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగ నాతత్త్వమును తెలిసికొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను. అతడును నాకు అత్యంత ప్రియుడైయున్నాడు.
18 వ శ్లోకం:--
ఉదారాః సర్వ ఏవైతే ఙ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ |
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ||
భావం:--
18 వ శ్లోకం:--
ఉదారాః సర్వ ఏవైతే ఙ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ |
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ||
భావం:--
వీళ్ళంతా గొప్పవాళ్ళే అయినప్పటికీ జ్ఞాని మాత్రం నా ఆత్మస్వరూపుడే అని నా అభిప్రాయం. ఎందువల్లనంటే అతను నన్నే పరమగతిగా భావించి సేవిస్తాడు.19 వ శ్లోకం:--
బహూనాం జన్మనామంతే ఙ్ఞానవాన్మాం ప్రపద్యతే |
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ||
భావం:--
బహూనాం జన్మనామంతే ఙ్ఞానవాన్మాం ప్రపద్యతే |
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ||
భావం:--
అనేక జన్మలలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా జ్ఞాని చివర జగత్తు సర్వమూ వాసుదేవమయం అనే జ్ఞానంతో నన్నాశ్రయిస్తాడు. ఈ లోకంలో అలాంటి మహానుభావులు చాలా అరుదు.
20 వ శ్లోకం:-- కామైస్తైస్తైర్హృతఙ్ఞానాః ప్రపద్యంతేஉన్యదేవతాః |
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా ||
భావం:--
అనేకవిధములైన భోగవాంఛలలో కూరుకొనిపోయినవారి జ్ఞానము అంతరించిపోవును. వారు తమతమస్వభావములకు అనుగుణముగా వారివారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు.
No comments:
Post a Comment