May 20, 2013

భగవద్గీత:---అథ చతుర్థో‌உధ్యాయః-- 31 నుండి 42 శ్లోకాలు....

భగవద్గీత:---అథ చతుర్థో‌உధ్యాయః-- 31 నుండి 42 శ్లోకాలు....

యఙ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ |
నాయం లోకో‌உస్త్యయఙ్ఞస్య కుతో‌உన్యః కురుసత్తమ || 

భావం:--
ఓ కురుసత్తమా ! యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును, పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయనివారికి ఈమర్త్యలోకమే సుఖప్రదము కాదు. ఇంక పరలోక మెక్కడిది ?
32 వ శ్లోకం:--

ఏవం బహువిధా యఙ్ఞా వితతా బ్రహ్మణో ముఖే |
కర్మజాన్విద్ధి తాన్సర్వానేవం ఙ్ఞాత్వా విమోక్ష్యసే ||


భావం:--
ఈ ప్రకారముగనే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో సవివరముగా వివరింపబడినవి. ఈ యజ్ఞముల నన్నింటిని త్రికరణశుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపంనములగునని తెలిసికొనుము. ఇట్లు ఈ కర్మతత్త్వమును తెలిసికొనుము, అనుష్ఠానము వలన నీవు ప్రాపంచిక బంధములనుండి సర్వథా విముక్తుడయ్యేదవు.


33 వ శ్లోకం:--

శ్రేయాంద్రవ్యమయాద్యఙ్ఞాజ్ఙ్ఞానయఙ్ఞః పరంతప |
సర్వం కర్మాఖిలం పార్థ ఙ్ఞానే పరిసమాప్యతే ||

భావం:--
ఓ పరంతపా ! అర్జునా ! ద్రవ్యమయయజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్ఠమైనది. కర్మలన్నియును జ్ఞానమునందే పరసమాప్తమగును.



34 వ శ్లోకం:--

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి తే ఙ్ఞానం ఙ్ఞానినస్తత్త్వదర్శినః ||

భావం:--
అట్టి జ్ఞానము, తత్త్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారమొనర్చి, సమయము చూచి, వినయముగా ప్రశ్నించి, సేవచేసియు వారి వలన నెఱుంగము. వారు తప్పక నీకు పదేశింతురు.

35 వ శ్లోకం:--

యజ్ఙ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ |
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ||


భావం:--
ఓ అర్జునా ! ఈ తత్త్వజ్ఞానమునెఱింగినచో మఱల ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్తప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు.


36 శ్లోకం:-- 

అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః |
సర్వం ఙ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ||


భావం:--ఒకవేళ పాపాత్ములందఱి కంటెను నీవు ఒక మహాపాపిని అయినచో, జ్ఞానమనే తెప్ప సహాయముతో పాపసముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా దాటివేయగలవు.
37 శ్లోకం:--

యథైధాంసి సమిద్ధో‌உగ్నిర్భస్మసాత్కురుతే‌உర్జున |
ఙ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ||


భావం:--
అర్జున - అర్జునా, సమిద్ధః - మండుచున్న, అగ్నిః నిప్పు, యథా - ఎటుల, ఏధాంసి - కట్టెలను, భస్మసాత్ కురుతే - భస్మముగా జేయునో, తథా - అటుల, జ్ఞానాగ్నిః - జ్ఞానమనెడి అగ్ని, సర్వకర్మాణి - సమస్తకర్మలను, భస్మసాత్ కురుతే - భస్మముగా చేయుచున్నది.



38 వ శ్లోకం:--

న హి ఙ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే |
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి ||


భావం:--
ప్రపంచమున జ్ఞానముతో సమానముగ పవిత్రమైనది మరియొకటి లేనేలేదు. శుద్దాంతఃకరణముగల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి, ఆత్మయందు అదే జ్ఞానమును తనంతటతానే పొందుచున్నాడు.

39 శ్లోకం:--

శ్రద్ధావాఁల్లభతే ఙ్ఞానం తత్పరః సంయతేంద్రియః |
ఙ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి ||

భావం:--
ఇంద్రియ నిగ్రహము కలవానికి, తదేక నిష్ఠకలవానికి, శ్రద్ధాళువైన మనుజునకు ఈ భగవత్తత్త్వజ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్త్వ రూపమైన పరమశాంతిని పొందుచున్నాడు.

40 వ శ్లోకం:--

అఙ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోకో‌உస్తి న పరో న సుఖం సంశయాత్మనః ||

భావం:--
అవివేకియు, శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడేయగును. అట్టి సంశయచిత్తునకు ఈ లోకమునందుగాని, పరలోకమునందుగాని ఎట్టి సుఖమూ ఉండదు.

41 వ శ్లోకం:--

యోగసంన్యస్తకర్మాణం ఙ్ఞానసంఛిన్నసంశయమ్ |
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ ||

భావం:--
ఓ ధనంజయా ! విధిపూర్వకముగ కర్మలను ఆచరించుచు, కర్మ ఫలములను అన్నింటిని భగవదర్పణము చేయుచు, వివేకముద్వారా సంశయములనన్నింటిని తొలగించుకొనుచు, అంతఃకరణమును వశమునందుచుకొనిన వానిని కర్మలు బంధింపవు.

42 వ శ్లోకం:--

తస్మాదఙ్ఞానసంభూతం హృత్స్థం ఙ్ఞానాసినాత్మనః |
ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత ||

భావం:--
కావున ఓ భారతా ! (అర్జునా!) నీ హృదయమునందు గల అజ్ఞానము వలన పుట్టిన ఈ సంశయమును వివేకజ్ఞానమను ఖడ్గముతో రూపుమాపి, సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము లెమ్ము.



ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
ఙ్ఞానకర్మసంన్యాసయోగో నామ చతుర్థో‌உధ్యాయః || సంపూర్ణం ll





No comments:

Post a Comment