1 నుండి 10 శ్లోకాలు
శ్రీభగవానువాచ |
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః |
అసంశయం సమగ్రం మాం యథా ఙ్ఞాస్యసి తచ్ఛృణు ||
భావం:-- శ్రీ భగవానుడు: అర్జునా! మనస్సు నామీదే నిలిపి నన్నే ఆశ్రయించి, ధ్యానయోగాన్ని ఆచరిస్తూ సంశయం లేకుండా, సమగ్రంగా నన్ను ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను విను.
2 వ శ్లోకం
ఙ్ఞానం తేஉహం సవిఙ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః |
యజ్ఙ్ఞాత్వా నేహ భూయోஉన్యజ్ఙ్ఞాతవ్యమవశిష్యతే ||
భావం:-- బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు (స్వానుభవంతో) సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమీ వుండదు.
3
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే |
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ||
భావం:-- ఎన్నో వేలమందిలో ఏ ఒక్కడో యోగసిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్ళలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్న వాడు ఏ ఒక్కడో వుంటాడు.

4
భూమిరాపోஉనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ |
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ||
భావం:-- నా మాయాశక్తి ఎనిమిది విధాలుగా విభజింపబడింది. అవి: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం.
5
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ |
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ||
భావం:-- అర్జునా! ఇప్పుడు చెప్పింది అపరప్రకృతి. జీవరూపమై ఈ జగత్తునంతటినీ ధరిస్తున్న నా మరో ప్రకృతి ఇంతకంటే మేలైనదని తెలుసుకో.
6
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ |
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ||
భావం:-- నా ఈ రెండు ప్రకృతులనుంచే సమస్త భూతాలూ పుడుతున్నాయని గ్రహించు. అందువల్ల సర్వజగత్తూ ఆవిర్భవించడానికీ, అంతం కావడానికీ కారణం నేనే.
7
మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ |
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ||
భావం:--ధనంజయా! నా కంటే ఉత్కృష్టమైనదేదీ లేదు. దారం హారంగా మణులను కలిపి నిలిపినట్లు నేనే ఈ సమస్త జగత్తునీ ధరిస్తున్నాను.

8
రసోஉహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః |
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ||
భావం:-- కౌంతేయా! నేనే నీటిలో రుచిగా, సూర్యచంద్రులలో కాంతిగా, సర్వవేదాలలో ఓంకారంగా, ఆకాశంలో శబ్దంగా, నరులలో పురుషకారంగా వున్నాను.

9
పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ |
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ||
భావం:-- నేలలోని సుగంధం, నిప్పులోని తేజస్సు, సర్వభూతాలలోని ఆయుస్సు, తపోధనులలోని తపస్సు నేనే.

No comments:
Post a Comment