అథ పంచమోஉధ్యాయః-----1 నుండి 10 శ్లోకాలు:--
అర్జున ఉవాచ |
సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి |
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ||
భావం:--
అర్జునుడు పలికెను - ఓ కృష్ణా ! ఒక్కసారి కర్మసన్న్యాసమును, మరియొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో తెలియజేయుము.
2 వ శ్లోకం:--
శ్రీభగవానువాచ |
సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ |
తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే ||
భావం:--
శ్రీకృష్ణ భగవానుడు పలికెను - కర్మసన్న్యాసము, కర్మయోగము అను ఈ రెండును మోక్షమును కలుగచేయును. కాని ఈ రెండింటిలోను కర్మసన్న్యాసము కంటెను కర్మయోగమే శ్రేష్ఠమైనది.
3 వ శ్లోకం:--
ఙ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి |
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ప్రముచ్యతే ||
భావం:--
ఓ మహాబాహో ! ఎవ్వరినీ ద్వేషింపని, దేనినీ కాంక్షింపని కర్మయోగిని నిత్యసన్న్యాసిగా ఎఱుంగవలెను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు అవలీలగా సంసారబంధముల నుండి విముక్తుడగును.
4 వ శ్లోకం:--
సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః |
ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలమ్ ||
భావం:--
సాంఖ్య, కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని అవివేకులు పలికెదరు. పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్క దానినైనను బాగుగా ఆచరించిన వాడు ఈ రెండింటికి ఫలస్వరూపమైన పరమాత్మను పొందుచున్నాడు.
5 వ శ్లోకం:--
యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే |
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ||
భావం:--
జ్ఞానయోగులు పొందు మోక్షమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞానయోగఫలమును, కర్మయోగఫలమును ఒక్కటిగా చూచువాడే నిజమును గ్రహించినవాడగును.
6 వ శ్లోకం:--
సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః |
యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్ఛతి ||
భావం:--గొప్ప బాహువులు కల ఓ అర్జునా ! కర్మయోగమును అనుష్ఠింపకసన్న్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము.
7 వ శ్లోకం:--
యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః |
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ||
భావం:--
కర్మయోగము నాచరించువాడు మనస్సును వశమునందుంచుకొనినవాడు, జితేంద్రియుడు, అంతఃకరణశుద్ధి కలవాడు, సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవానికి కర్మలను ఆచరించుచున్నను వాటిచేత అంటబడడు.
8 & 9 వ శ్లోకాలు:--
నైవ కించిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ |
పశ్యఞ్శృణ్వన్స్పృశంజిఘ్రన్నశ్నన్గచ్ఛన్స్వపఞ్శ్వసన్ ||
ప్రలపన్విసృజన్గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి |
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ||
భావం:--
పరమార్ధతత్వము నెఱిగిన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆఘ్రణించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాస క్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరుచుచు, మూయుచు ఉన్నను ఇంద్రియములు తమతమవిషయముల యందు వర్తించుచున్నవనియు, తానేమియు చేయుటలేదనియే తలంచును.
10 వ శ్లోకం:--
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః |
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ||
భావం:--
కర్మలన్నింటిని భగవదర్పణము గావించి, ఫలాసక్తిరహితముగ కర్మలనాచారించు వానిని తామరాకుపై నీటిబిందువుల వలె పాపముచేత అంటబడదు.

No comments:
Post a Comment