June 5, 2013

భగవద్గీత--అథ షష్ఠో‌உధ్యాయః--31 నుండి 40 శ్లోకాలు--ఆత్మసంయమయోగః......

భగవద్గీత--అథ షష్ఠో‌உధ్యాయః--31 నుండి 40 శ్లోకాలు--ఆత్మసంయమయోగః...... 

సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః |
సర్వథా వర్తమానో‌உపి స యోగీ మయి వర్తతే || 

భావం:--
భగవంతునియందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వథా సర్వవ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నా యందే ప్రవర్తించుచుండును.


32 వ శ్లోకం:--

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో‌உర్జున |
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః ||

భావం:--
ఓ అర్జునా ! సర్వప్రాణులను తనతో సమానముగా చూచు వాడును, సుఖమునుగాని, దుఃఖమునుగాని సమముగా, సమానముగ చూచువాడును ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖదుఃఖములుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు అని చెప్పడుచున్నాడు.

33 వ శ్లోకం:--

అర్జున ఉవాచ |
యో‌உయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన |
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్స్థితిం స్థిరామ్ ||


భావం:--
అర్జునుడు పలికెను ఓ మధుసూదనా! సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగముయొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్యకారణమున తెలిసికొనలేకున్నాను.


34 వ శ్లోకం:--

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ |
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ || 

భావం:-- 
ఓ కృష్ణా ! ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, బాగుగా మధించు స్వభావము గలది. దృఢమైనది. మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటనువలె మిక్కిలి దుష్కరమని నాకు తోచుచున్నది.

35 వ శ్లోకం:--

శ్రీభగవానువాచ |
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే || 

భావం:-- 
శ్రీకృష్ణ భగవానుడు పలికెను, హే మహాబాహో! నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే. దానిని వశపరచుకొనుట మిక్కిలి కష్టము. కౌంతేయా! అభ్యాసవైరాగ్యములద్వారా మనసు నిగ్రహింపబడుచున్నది.


36 వ శ్లోకం:--

అసంయతాత్మనా యోగో దుష్ప్రాన ఇతి మే మతిః !

వశ్యాత్మనా తు యతతా శక్యోపావాప్తుముపాయతః ! ||  

భావం:--
మనస్సును వశపరచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. కాని మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధనద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము.

37 వ శ్లోకం:--

అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః !
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణగచ్ఛతి ! 
|| 

భావం:--
అర్జునుడు పలికెను ! ఓ కృష్ణా ! యోగమునందు శ్రద్ధతో యోగసాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసానదశలో మనస్సు చలించి, ఆత్మసాక్షాత్కారమును పొందకయే మరణించిన సాధకుని గతియేమగును?


38 వ శ్లోకం:--

కచ్ఛిన్నోభయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి !
అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ! 
|| 

భావం:--
హే మహాబాహో ! శ్రీక్రుష్టా ! అతడు యోగభ్రష్టుడు భగవత్ర్పాప్తి మార్గమునుండి జారినవాడై, ఆశ్రయరహితుడై, ఉభయభ్రష్టుడై, ఛిన్నాభిన్నమైన మేఘమువలె నశింపడు గదా ! 

39 వ శ్లోకం:--

ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః ! 
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ! || 

భావం:--
కృష్ణా ! ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తిచేయుట నీకే చెల్లును. ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికిని శక్యము కాదు.

40 వ శ్లోకం:--

శ్రీభగవాన్ ఉవాచ :- పార్ధ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే ! 
న హి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి ! || 

భావం:--
శ్రీభగవానుడు పలికెను ఓ పార్థా! అట్టి పురుషుడు ఈ లోకమున గాని, పరలోకమున గాని అధోగతిపాలుకాడు. ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్యకర్మలను ఆచరించు వాడెవ్వడును దుర్గతి పాలుగాడు గదా!



No comments:

Post a Comment