June 5, 2013

భగవద్గీత--అథ షష్ఠో‌உధ్యాయః 11 నుండి 20 శ్లోకాలు --ఆత్మసంయమయోగః......

భగవద్గీత--అథ షష్ఠో‌உధ్యాయః 11 నుండి 20 శ్లోకాలు --ఆత్మసంయమయోగః...... 

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః |
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ || 

భావం:--
పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా ధర్భాసనమును, జింకచర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పఱచి అంత ఎక్కువగాకాని, తక్కువగాకాని కాకుండ సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను.

12 వ శ్లోకం

తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియాః |
ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మవిశుద్ధయే ||

భావం:--
ఆ ఆసనముపై కూర్చొని, చిత్తేంద్రియవ్యాపారములను వశము నందుంచుకొని, ఏకాగ్రతగల మనస్సుతో అంతఃకరణశుద్ధికై యోగాభ్యాసమును సాధనచేయవలెను.

13 వ శ్లోకం

సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః |
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ||

భావం:--
శరీరమును మెడను శిరస్సును నిటారుగ నిశ్చలముగా స్థిరముగా నుంచి, దిక్కులను చూడక తననాసికాగ్రభాగమునందే దృష్టిని నిలుపవలెను.


14 వ శ్లోకం 

ప్రశాంతాత్మా విగతభీర్బ్రహ్మచారివ్రతే స్థితః |
మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః || 

భావం:-- 
ధ్యానయోగి ప్రశాంతాత్ముడై, భయరహితుడై, బ్రహ్మచర్యవ్రతమును పాటించుచు, మనోనిగ్రహముతో నాయందు చిత్తము గలవాడై, నన్నే పరమ గతిగ నమ్మి నిశ్చలుడైయుండవలెను.

15 వ శ్లోకం 

యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః |
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి || 

భావం:-- 
మనోనిగ్రహశాలియైన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమొనర్చి, నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠరూపమైన శాంతిని పొందుచున్నాడు.


16 వ శ్లోకం:--

నాత్యశ్నతస్తు యోగో‌உస్తి న చైకాంతమనశ్నతః |

న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున || 

భావం:--
అర్జునా ! అతిగా భుజించువానికిని, ఏ మాత్రము భుజింపనివానికిని, అతిగా నిద్రించువానికిని, ఎల్లప్పుడు మేల్కొని యుండువానికిని ఈ యోగసిద్ధి కలుగదు.

17 వ శ్లోకం

యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు |
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ||


భావం:--
మితాహారము, కర్మలందు మితమైన ప్రవర్తన గలవాడును, మితమైన నిద్రగల మనుజునకు యోగము దుఃఖములను పోగొట్టునదిగ అగుచున్నది.

18 వ శ్లోకం

యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే |

నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా || 

భావం:-- 
చిత్తమునడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వథా సర్వవ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నా యందే ప్రవర్తించుచుండును.

19 వ శ్లోకం 

యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః || 

భావం:-- 
వాయుప్రసారములేని చోట నిశ్చలముగా నుండు దీపమువలె యోగికి వశమైయున్న చిత్తము పరమాత్మధ్యానమున నిర్వికారముగా నిశ్చలముగా నుండును.

20 వ శ్లోకం 

యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా |
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి || 

భావం:-- 
ధ్యానయోగసాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది, పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో, ఆ భగవానుని సాక్షాత్కరింపజేసికొని, యోగి ఆ పరమాత్మయందే సంతుష్టుడగుచున్నాడు.



No comments:

Post a Comment