భగవద్గీత--అథ షష్ఠోஉధ్యాయః--1 నుండి 10 శ్లోకాలు....ఆత్మసంయమయోగః.
శ్రీభగవానువాచ |
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః |
స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ||
భావం:--
శ్రీభగవానుడు పలికెను - కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్యకర్మలను ఆచరించువాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి. కాని కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్న్యాసియుకాడు.
2 వ శ్లోకం:--
యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ |
న హ్యసంన్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన ||
భావం:--
ఓ అర్జునా ! సన్న్యాసము అని పిలువబడునదియే యోగము అని తెలిసికొనుము. సంకల్పత్యాగము చేయనివాడెవ్వడును యోగి కానేరడు.
3 వ శ్లోకం:--
ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే |
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ||
భావం:--
యోగారూఢస్థితినిపొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామకర్మాచరణమువలననే యోగప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము.
4 వ శ్లోకం:--
యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే |
సర్వసంకల్పసంన్యాసీ యోగారూఢస్తదోచ్యతే ||
భావం:--
ఇంద్రియభోగములయందును, కర్మలయందును ఆసక్తినుంచక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడనబడును.
5 వ శ్లోకం:--
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః ||
భావం:--
మనుజులు ఈ సంసారసాగరము నుండి తమను తామే ఉద్ధరించు కొనవలెను. తమకుతామే అధోగతిపాలుకారాదు. లోకములో వాస్తవముగ తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు.
6 వ శ్లోకం:--
బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః |
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ||
భావం:--
ఎవరు తన మనస్సును జయించునో అట్టి వాని మనస్సు బంధువులా ఉపకారిలా వుండును. మనస్సును జయింపనిచో అది శత్రువై అపకారము చేయును.
7 వ శ్లోకం:--
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః ||
భావం:--
శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణవృత్తులు నిశ్చలముగా ఉండి, స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు పరమాత్మ చక్కగా స్థితుడై యుండును.
8 వ శ్లోకం:--
ఙ్ఞానవిఙ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః ||
భావం:--
యోగియొక్క అంతఃకరణము నందు జ్ఞానవిజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు. ఇంద్రియాదులను పూర్తిగా వశపరచుకొనిన వాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును.
9 వ శ్లోకం:--
సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు |
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ||
భావం:--
సుహృదులయందును, మిత్రులయందును, శత్రువుల యందును, ఉదాసీనులయందును, మధ్యస్థులయందును, ద్వేషింపదగినవారి యందును, బంధువులయందును, ధర్మాత్ములయందును, పాపులయందును సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు.
10 వ శ్లోకం:--
యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః |
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ||
భావం:--
శరీరేంద్రియమనస్సులను స్వాధీనపరచుకొనినవాడు, ఆశారహితుడు, వ్రతుడు అయిన యోగి ఒంటరి ప్రదేశమున కూర్చొని, ఆత్మను నిరంతరము పరమాత్మయందే ఉంచవలెను.

No comments:
Post a Comment