May 30, 2013

భగవద్గీత అథ పంచమో‌உధ్యాయః-----21 నుండి 29 శ్లోకాలు:-- (కర్మసన్యాసయోగము)

భగవద్గీత అథ పంచమో‌உధ్యాయః-----21 నుండి 29 శ్లోకాలు:--

బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖమ్ |
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే || 

భావం:--
ప్రాపంచిక విషయములయందు అనాసక్తమైన అంతః కరణముగల సాధకుడు ఆత్మస్థితధ్యానజనితమైన సాత్త్వికాత్మానందమును పొందును. పిదప అతడు బ్రహ్మనిష్ఠయను సమాధితో గూడుకొనినవాడై, అక్షయమును పొందుచున్నాడు.


22 వ శ్లోకం:--

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే |
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ||

భావం:--
ఓ అర్జునా ! విషయేంద్రియసంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నియును భోగలాలసులకు సుఖములుగా భాసించినను అవినిస్సందేహముగా దుఃఖహేతువులే. ఆద్యంతములు గలవి. అనగా అనిత్యములు. వివేకి వాటియందు ఆసక్తుడు కాడు.


23 వ శ్లోకం:--

శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్ |
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ||

భావం:--
ఎవరు ఈ శరీరమును విడువకముందే అనగా జీవించి యుండగనే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకొనునో అతడే నిజమైన ఆత్మానంద యోగి. పాంతః.



24 వ శ్లోకం:--

యో‌உంతఃసుఖో‌உంతరారామస్తథాంతర్జ్యోతిరేవ యః |
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో‌உధిగచ్ఛతి ||


భావం:--
ఎవరు అంతరాత్మయందే సుఖించుచు, ఆత్మయందే రమించునో అట్టి ఆత్మజ్ఞానియైన సాంఖ్యయోగి, పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడై, బ్రహ్మ సాక్షాత్కారమును పొందును.

25 వ శ్లోకం:--

లభంతే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః |
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః ||

భావం:--
పాపరహితులును, జ్ఞానప్రభావమున సమస్తసంశయముల నివృత్తిని సాధించినవారును, సర్వప్రాణులహితమునుగోరుఋషులు, బ్రహ్మనిర్వాణమును పొందుచున్నారు.


26 వ శ్లోకం:-- 

కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్ |
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ ||

భావం:--
కామక్రోధములు లేనివారు, మనోనిగ్రహము కలవారును అయి, పరబ్రహ్మపరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను పరబ్రహ్మపరమాత్మయే గోచరించును.

27 & 28 వ శ్లోకాలు:--

స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాంతరే భ్రువోః |
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ |

యతేంద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః |
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ||


భావం:--
బాహ్య విషయభోగములను చింతనచేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందును స్థిరముగా ఉంచవలెను. నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధనల వలన మోక్షపరాయణుడైన సాధకుడు ఇచ్ఛాభయక్రోధరహితుడై ఎల్లప్పుడు ముక్తుడగును.

29 వ శ్లోకం:--

భోక్తారం యఙ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ |
సుహృదం సర్వభూతానాం ఙ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి ||

భావం:--
భగవంతుడు యజ్ఞములకును, తపస్సులకును భోక్త. సమస్తలోకములకును లోకేశ్వరులకును అధిపతి. సమస్త ప్రాణులకును ఆత్మీయుడు. పరమ ప్రేమస్వరూపుడు. ఇట్టి భగవత్తత్త్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును.


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
కర్మసంన్యాసయోగో నామ పంచమో‌உధ్యాయః ||





No comments:

Post a Comment