భగవద్గీత:---అథ చతుర్థోஉధ్యాయః-- 11 నుండి 20 శ్లోకాలు....
యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ||

భావం:--
ఓ పార్థా ! భక్తులు నన్ను ఎవరు ఏవిధముగా సేవింతురో ఆ విధముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరును వివిధరీతులలో నా మార్గమును అనుసరించుచున్నారు.

12 వ శ్లోకం:--
కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః |
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ||
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ||
భావం:--
ఈ లోకమున కర్మఫలమును ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా కలుగుచున్నది.

13 వ శ్లోకం:--
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః |
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ||
భావం:-- తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ||
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మల ననుసరించి వేర్వేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను, శాశ్వతుడను పరమేశ్వరుడను ఐన నన్ను వాస్తవముగ ఆకర్తనుగా తెలిసికొనుము.
14 వ శ్లోకం:--
న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యోஉభిజానాతి కర్మభిర్న స బధ్యతే ||
ఇతి మాం యోஉభిజానాతి కర్మభిర్న స బధ్యతే ||
భావం:--
నాకు కర్మఫలాసక్తి లేదు. కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నాతత్త్వమును తెలిసినవారు కర్మలచే బంధింపబడరు.

15 వ శ్లోకం:--
ఏవం ఙ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః |
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ ||
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ ||
భావం:--
ఓ అర్జునా ! నా తత్త్వరహస్యమును తెలిసికొని కర్మల నాచరించిరి. కావున నీవును ఆ పూర్వులవలెనే నిష్కామ భావముతో కర్మల నాచరింపుము.

16 వ శ్లోకం:--
కిం కర్మ కిమకర్మేతి కవయోஉప్యత్ర మోహితాః |
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఙ్ఞాత్వా మోక్ష్యసేஉశుభాత్ ||
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఙ్ఞాత్వా మోక్ష్యసేஉశుభాత్ ||
భావం:--
కర్మ అనగా నేమి ? అకర్మ యనగా నేమి ? ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము తికమకపడుచున్నారు కావున కర్మతత్త్వమును నీకు చక్కగా విశదపరచెదను.
17 వ శ్లోకం:--
కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః |
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ||
భావం:--
కర్మ తత్త్వమును తెలిసికొనవలెను. అట్లే అకర్మ స్వరూపమును గూడ ఎరుగవలెను.వికర్మ లక్షణములను కూడా తెలిసికొనుట చాల అవసరము. ఏలనన కర్మతత్త్వము చాల లోతైనది.
18 వ శ్లోకం:--
కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః |
స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ||
భావం:--
కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో వివేకమయుడు. అతడు యోగి మఱియు సమస్తకర్మలు చేయువాడు.
19 వ శ్లోకం:--
యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః |
ఙ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ||
భావం:--
ఎవని కర్మలన్నియును, శాస్త్రమ్మతములై, కామసంకల్ప వర్జితములై జరుగునో అట్లే ఎవని కర్మలన్నియును జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని పేర్కొనిరి.
20 వ శ్లోకం:--
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః |
కర్మణ్యభిప్రవృత్తోஉపి నైవ కించిత్కరోతి సః ||
భావం:--
ఎవడు కర్మఫలమందాసక్తిని విడనాడి నిరంతరము సంతృప్తి కలవాడై దేనిని ఆశ్రయించకనుండునో, అట్టివాడు వాస్తవముగా వాటికి కర్తకాడు.

No comments:
Post a Comment