May 30, 2013

భగవద్గీత....అథ పంచమో‌உధ్యాయః-----11 నుండి 20 శ్లోకాలు:--(కర్మసన్యాసయోగము)

భగవద్గీత....అథ పంచమో‌உధ్యాయః-----11 నుండి 20 శ్లోకాలు:--

కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి |
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే || 

భావం:-- 
కర్మయోగులు ఫలాసక్తిరహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణశుద్ధికై కర్మలను ఆచరించుచున్నారు.
12 వ శ్లోకం:--

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్ |
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ||

భావం:--
నిష్కామకర్మయోగి కర్మఫలములను త్యజించి, భగత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలనాచారించి బద్ధుడగు చున్నాడు.

13 వ శ్లోకం:--

సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశీ |
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ||

భావం:--
ఇంద్రియ నిగ్రహముతో నవద్వారములు గల శరీరమునందు సమస్తకర్మలను మానసికముగా త్యజించి, పరమాత్మస్వరూపమున స్థితుడై, ఆనందమును అనుభవించు చున్నాడు.


14 వ శ్లోకం:-

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ||


భావం:--
భగవంతుడు జీవుల యొక్క కర్తృత్వమును గాని, వారి కర్మలనుగాని, కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ యన్నింటిలో ప్రకృతియే ప్రవర్తించుచున్నది.


15 వ శ్లోకం:--

నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః |
అఙ్ఞానేనావృతం ఙ్ఞానం తేన ముహ్యంతి జంతవః ||


భావం:--
సర్వవ్యాపియైన భగవంతుడు ప్రాణుల పుణ్యపాపకర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి యుండుట వలన ప్రాణులు భ్రమకి లోనగుచున్నారు.


16 వ శ్లోకం:-- 

ఙ్ఞానేన తు తదఙ్ఞానం యేషాం నాశితమాత్మనః |

తేషామాదిత్యవజ్ఙ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ || 

భావం:-- 
అజ్ఞానము పరమాత్మతత్త్వ జ్ఞానప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి పరమాత్మను సూర్యుని వలె ప్రకాశింపజేయుచున్నది.

17 వ శ్లోకం:--

తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్ఠాస్తత్పరాయణాః |
గచ్ఛంత్యపునరావృత్తిం ఙ్ఞాననిర్ధూతకల్మషాః ||

భావం:--
పరమాత్మయందే నిరంతరము ఏకీభావములో స్థితులై, తత్పరాయణులైన పురుషులు జ్ఞానసాధనతో పాపరహితులై, పునరావృత్తి రహితమైన శాశ్వత పరమగతిని పొందుచున్నారు.

18 వ శ్లోకం:--

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ||

భావం:--
విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణునియందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వానియందును, చండాలుని యందును సమదృష్టిని గలవానినే జ్ఞాని అందురు.

19 వ శ్లోకం:--

ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః |
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్బ్రహ్మణి తే స్థితాః ||


భావం:--
ఎవరి మనస్సు సమభావమందు స్థిరమై యున్నదో అట్టివారు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు. అనగా ప్రాపంచిక విషయాతీతస్థితికి చేరుదురు. పరమాత్మ దోషరహితుడు, సముడు, అందువలన సమభావస్థిత మనస్కులైన బ్రహ్మమునందున్న వారేయగుదురు.


20 వ శ్లోకం:-

న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య నోద్విజేత్ప్రాప్య చాప్రియమ్ |
స్థిరబుద్ధిరసంమూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః ||


భావం:--
స్థిరమైన బుద్ధిగలవాడును, మోహవివశుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త ఇష్టమైన దానిని పొందినపుడు సంతోషముగాని, అనిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖముగాని పొందడు.




No comments:

Post a Comment