May 20, 2013

భగవద్గీత:---అథ చతుర్థో‌உధ్యాయః-- 1 నుండి 10 శ్లోకాలు....జ్ఞాన కర్మసన్న్యాసయోగః

భగవద్గీత:---అథ చతుర్థో‌உధ్యాయః-- 1 నుండి 10 శ్లోకాలు....

శ్రీభగవానువాచ |
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ |
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే‌உబ్రవీత్ ||

భావం:--
శ్రీ భగవానుడు ఇట్లు పలికెను - నేను నిత్యసత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వతమనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు చెప్పెను.

2 వ శ్లోకం:--

ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః
స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప ||

భావం:--
ఓ పరంతపా ! ఈ విధముగా వచ్చిన ఈ యోగమును రాజర్షులు తెలిసికొనిరి. కాని అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు అగుపించుటలేదు.

3 వ శ్లోకం:--

స ఏవాయం మయా తే‌உద్య యోగః ప్రోక్తః పురాతనః |
భక్తో‌உసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ||

భావం:--
ఈ యోగము అతి ఉత్తమమైనది. రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు. ప్రియసఖుడవు. కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నీకు తెలిపితిని.

4 వ శ్లోకం:--

అర్జున ఉవాచ |
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః |
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ||

భావం:--
అర్జునుడు పలికెను - కృష్ణా ! నీ జన్మ ఇటీవలిదే. సూర్యునిజన్మ కల్పాదియందు జరిగినది. అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను ఏ విధముగా తెలుసుకోగలను.

5 వ శ్లోకం:--

శ్రీభగవానువాచ |
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ||

భావం:--
శ్రీ భగవానుడు తెలిపెను - ఓ పరంతపా ! అర్జునా ! నాకును నీకును అనేక జన్మలు గడచినవి. కాని వాటిని అన్నింటిని నేను ఎఱుంగుదును. నీ వెఱుగవు.

6 వ శ్లోకం:--

అజో‌உపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో‌உపి సన్ |
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ||

భావం:--
నేను పుట్టుక లేనివాడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను. అయినను నా ప్రకృతిని అధీనములో నుంచుకొని, నా యోగమాయచే జన్మమెత్తుచున్నాను.

7. వ శ్లోకం:--

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ||

భావం:--
ఓ భారతా ! ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చుపెరిగిపోవుచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును. అనగా సాకారరూపముతో ఈ లోకమున అవతరింతును.

8. వ శ్లోకం:--

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||

భావం:--
సజ్జనులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతియుగము నందును అవతరించుచుందును.

9. వ శ్లోకం:--

జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః |
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో‌உర్జున ||

భావం:--
ఓ అర్జునా ! ఎవరు నా దివ్యమైన జన్మమును, కర్మమును గూర్చి యధార్థముగా తెలుసుకొనునో అట్టివాడు తనువును చాలించిన పిమ్మట మ రల జన్మింపడు సరికదా ! నన్నే పొందుచున్నాడు.

10. వ శ్లోకం:--

వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః |
బహవో ఙ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ||

భావం:--
అనురాగము, భయము, క్రోథము వీడిన వారు, దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి గలిగి, నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞానతపస్సంపన్నులై పవిత్రులైన నా స్వరూపమును పొందియున్నారు.


No comments:

Post a Comment