May 15, 2013

భగవద్గీత:---అథ తృతీయో‌உధ్యాయః..కర్మయోగః..31 నుడి 43 శ్లోకాలు...

భగవద్గీత:---అథ తృతీయో‌உధ్యాయః..కర్మయోగః..31 నుడి 43 శ్లోకాలు... 

యే మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః |
శ్రద్ధావంతో‌உనసూయంతో ముచ్యంతే తే‌உపి కర్మభిః || 

భావం:-- 
శ్రద్ధాయుక్తులై అసూయలేనివారై నా ఈ మతమును అనుసరించు మానవులు గూడ సమస్త కర్మబంధముల నుండి విడివడుచున్నారు.

32 వ శ్లోకం:--

యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ |
సర్వఙ్ఞానవిమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః ||


భావం:--
ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త ప్రాపంచిక విషయముల యందును మోహితులై భ్రష్టులై, కష్టనష్టముల పాలయ్యెదరని గ్రహింపుము.


33 వ శ్లోకం:--

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్ఙ్ఞానవానపి |
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ||


భావం:--
సమస్త ప్రాణులును తమతమ ప్రకృతులను అనుసరించి స్వభావములకు లోబడి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించియే క్రియలను ఆచరించును. కావున నిగ్రహమేమిచేయగలదు.


34 వ శ్లోకం:--

ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ |
తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపంథినౌ ||


భావం:--
ప్రతి ఇంద్రియార్థము నందును రాగద్వేషములు దాగియున్నవి. మనుష్యుడు ఈ రెండింటికిని వశముకాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, ప్రబలశత్రువులు గదా.


35 వ శ్లోకం:--

శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||


భావం:--
పరధర్మము నందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మము నందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయంకరమైనది.


36 వ శ్లోకం:-- 

అర్జున ఉవాచ |

అథ కేన ప్రయుక్తో‌உయం పాపం చరతి పూరుషః |
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః || 

భావం:--
అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! మానవుడు తనకు ఇష్టము లేకున్నను బలాత్కారముగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచున్నాడు?  

37 వ శ్లోకం:-- 

శ్రీభగవానువాచ |

కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః |
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్ ||

భావం:-- 
శ్రీ భగవానుడు పలికెను రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము. ఇదియే క్రోధరూపముగా మారును. ఇది తృప్తిలేనిది. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ కామము మోక్షమునకు పరమశత్రువుగా ఎరుంగుము.

38 వ శ్లోకం:-- 

ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ |

యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ || 

భావం:-- 
పొగచే అగ్నియు,మురికిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడునట్లు, జ్ఞానము కామముచే కప్పుబడి యుండును.

39 వ శ్లోకం:-- 

ఆవృతం ఙ్ఞానమేతేన ఙ్ఞానినో నిత్యవైరిణా |

కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ || 

భావం:-- 
ఓ అర్జునా ! కామము అగ్నితో సమానమైనది. అది ఎన్నటికిని చల్లారదు. జ్ఞానులకు అది నిత్య శత్రువు. అది మనుష్యుని జ్ఞానమును వేయనున్నది. 

40 వ శ్లోకం:-- 

ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే |

ఏతైర్విమోహయత్యేష ఙ్ఞానమావృత్య దేహినమ్ || 

భావం:-- 
కామమునకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి నివాసస్థానములు. ఈ కామము మనో బుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి, జీవాత్మను మోహితునిగా చేయును. 

41 వ శ్లోకం:-- 

తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ |

పాప్మానం ప్రజహి హ్యేనం ఙ్ఞానవిఙ్ఞాననాశనమ్ || 

భావం:-- 
కావున ఓ అర్జునా ! మొదట ఇంద్రియములను వశపరచకొనుము. పిదప జ్ఞానవిజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపియైన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నొడ్డి పూర్తిగా విడుపుము.

42 వ శ్లోకం:-- 

ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః |

మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః || 

భావం:-- 
స్థూలశరీరము కంటెను ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కంటెను మనస్సు, దానికంటేను బుద్ధి గొప్పది, ఆ బుద్ధి కంటెను మిక్కిలి గొప్పది, సూక్ష్మమైనది ఆత్మ. 

43 వ శ్లోకం:-- 

ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా |

జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ ||

భావం:-- 
ఈ విధముగా బుద్ధికంటెను ఆత్మ అతీతమైనదని తెలిసికొని, ఓ మహాబాహో ! బుద్ధిద్వారా మనస్సును వశపరచుకొని, జయింపశక్యముకాని శత్రువైన కామమును సంహరింపుము.


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
కర్మయోగో నామ తృతీయో‌உధ్యాయః ||



No comments:

Post a Comment