భగవద్గీత:--అథ ప్రథమోஉధ్యాయః 41 నుండి 47 శ్లోకాలు..
41 వ శ్లోకం:--
అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ||
భావం:--
ఓ కృష్ణా ! అధర్మము (పాపము) పెచ్చుపెరుగిపోయినపుడు కులస్త్రీలు మిక్కిలి దూషితులగుదురు. ఓ వార్ష్ణేయా ! స్త్రీలు దూషితులు ఐనచో వర్ణసాంకర్యము ఏర్పడును.
42 వ శ్లోకం:--
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ||
భావం:--
వర్ణసాంకర్యము కులఘాతకులను, కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు(శ్రార్ధతర్పణములు)
43 వ శ్లోకం:--
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః |
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ||
భావం:--
వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషములవలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు, జాతిధర్మములు నష్టమగును.
44 వ శ్లోకం:--
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకేஉనియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ||
భావం:--
ఓ జనార్ధనా ! కులధర్మములు నశించినవారికి నిరవధికముగా (కలకాలము) నరకప్రాప్తి తప్పదని ప్రతీతి.
45 వ శ్లోకం:--
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ||
భావం:--
అయ్యో ! మనము బుద్ధిమంతులమైయుండియు రాజ్యసుఖలోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై, ఈ ఘోరపాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము--ఇది ఎంత దారుణము ?
46 వ శ్లోకం:--
యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ||
భావం:--
శస్త్రరహితుడనై, ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను, అది నాకు మిక్కిలి క్షేమకరమే యగును.
47 వ శ్లోకం:--
సంజయ ఉవాచ |
ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ||
భావం:--
సంజయుడు పలికెను---అర్జునుడు ఈ విధముగా పలికి శోకసంవిగ్న మానసుడై, యుద్ధభూమియందు ధనుర్బాణములను త్యజించి, రథము వెనుకభాగమున చతికిలబడెను.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
*******అర్జునవిషాదయోగో నామ ప్రథమోஉధ్యాయః******

No comments:
Post a Comment