భగవద్గీత:--అథ ద్వితీయోஉధ్యాయః 11 నుండి 20 శ్లోకాలు....
11 వ శ్లోకం:--
శ్రీభగవానువాచ |
అశోచ్యానన్వశోచస్త్వం ప్రఙ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||
11 వ శ్లోకం:--
శ్రీభగవానువాచ |
అశోచ్యానన్వశోచస్త్వం ప్రఙ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||
భావం:--
శ్రీకృష్ణభగవానుడు పలికెను--- ఓ అర్జునా ! సోకిమ్పదగని వారికొరకై నీవు సోకించుచున్నావు. పైగా పండితుని(జ్ఞాని) వలె మాట్లడుచున్నావు. పండితులైనవారు ప్రాణములు పోయిన వారిని గూర్చిగాని, ప్రాణములు పోనివారిని గురించిగాని శోకింపరు.
12 వ శ్లోకం:--
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ||
భావం:--
నీవుగాని, నేను గాని, ఈ రాజులుగాని ఉండని కాలమే లేదు. (అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము. అది అన్ని కాలముల యందును ఉండును. శరీరపతనముతో అది నశించునది కాదు.)
నీవుగాని, నేను గాని, ఈ రాజులుగాని ఉండని కాలమే లేదు. (అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము. అది అన్ని కాలముల యందును ఉండును. శరీరపతనముతో అది నశించునది కాదు.)
13 వ శ్లోకం:--
దేహినో௨స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా |
తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ||
భావం:--
జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరియొక దేహప్రాప్తి కలుగును. ధీరుడైనవాడు ఈ విషయమున మోహితుడు కాడు.
14 వ శ్లోకం:-
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః |
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః |
ఆగమాపాయినో௨నిత్యాః తాం స్తితిక్షస్వ భారత ||
భావం:--
ఓ కౌంతేయా ! విశయెన్ద్రియ సంయోగము వలన శీతోష్ణములు, సుఖదుఃఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాసశీలములు. కనుక భారతా ! వాటిని సహింపుము. (పట్టించుకొనకుము).
భావం:--
ఓ కౌంతేయా ! విశయెన్ద్రియ సంయోగము వలన శీతోష్ణములు, సుఖదుఃఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాసశీలములు. కనుక భారతా ! వాటిని సహింపుము. (పట్టించుకొనకుము).
15 వ శ్లోకం:--
యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ |
సమదుఃఖసుఖం ధీరం సోஉమృతత్వాయ కల్పతే ||
భావం:--
ఏలనన, ఓ పురుషశ్రేష్ఠ ! ధీరుడైనవాడు సుఖదుఃఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేందరియ సంయోగములు చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు.
16 వ శ్లోకం:--
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |
ఉభయోరపి దృష్టో௨న్తః త్వనయో స్తత్త్వదర్శిభిః ||
భావం:--
అసత్తు అనుదానికి( అనిత్యమైనదానికి) ఉనికియే లేదు. సత్తు అనుదానికి లేమి లేదు. ఈ విధంగా ఈ రెండింటి యొక్క వాస్తవరూపములను తత్వజ్ఞానియైన వాడే ఎరుంగును.
17 వ శ్లోకం--
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్‌కర్తుమర్హతి ||
భావం:--
నాశరహితమైన ఆ సత్యము(పరమాత్మ తత్వము) జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని తెలుసుకొనుము. శాశ్వతమైన దానిని ఎవ్వరు నసింపజేయజాలరు.
18 వ శ్లోకం:--
అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః |
అనాశినోஉప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ||
భావం:--
ఈ శరీరములు అన్నియును నసించునవియే. కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము(అనిర్వచనీయము), నిత్యము, కనుక( ఈ విషయము తెలుసుకొని) ఓ భరతవంశీ ! అర్జునా ! నీవు యుద్ధము చేయుము.
19 వ శ్లోకము:--
య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ |
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే ||
భావం:--
ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలనన, వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు. ఎవ్వరిచేతను చంపబడదు.
20 వ శ్లోకం:--
న జాయతే మ్రియతే వా కదాచిత్నా యం భూత్వా భవితా వా న భూయః |
అజో నిత్యః శాశ్వతో௨యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ||

No comments:
Post a Comment