భగవద్గీత:---అథ తృతీయోஉధ్యాయః..కర్మయోగః..11 నుడి 20 శ్లోకాలు...
దేవాన్భావయతానేన తే దేవా భావయంతు వః |
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ||
భావం:--
"ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపఱచుడు. మఱియు ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహింతురు. నిష్వార్థభావముతో మీరు పరస్పరము సంతృప్తిపఱచుకోనుచు పరమశ్రేయస్సును పొందగలరు." అని పలికెను.
12 వ శ్లోకం:--
ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యంతే యఙ్ఞభావితాః |
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ||
భావం:--
యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మానవులకు ఆయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగ దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదనచేయక తానే అనుభవించు వాడు నిజముగా దొంగయే.
13 వ శ్లోకం:--
యఙ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః |
భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ ||
భావం:--
యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠపురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీరపోషణ కొఱకే ఆహారమును సిద్ధపరచుకొను పాపులు పాపమునే భుజింతురు.
14 & 15 శ్లోకాలు:--
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః |
యఙ్ఞాద్భవతి పర్జన్యో యఙ్ఞః కర్మసముద్భవః ||
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ |
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యఙ్ఞే ప్రతిష్ఠితమ్ ||
భావం:--
ప్రాణులన్నియు అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి మేఘముల వలన ఏర్పడును. మేఘము యజ్ఞముల వలన కలుగుతోంది. విహితకర్మలు యజ్ఞములకు మూలము. వేదములు సత్కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరబ్రహ్మ నుండి ఉద్భవించినవని తెలిసికొనుము. అందువలన సర్వావ్యాపకమగు పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై యున్నాడు.
16 వ శ్లోకం:--
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః |
అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి ||
భావం:--
ఓ అర్జునా ! ఈ ప్రకారముగా కొనసాగుతున్న సృష్టిచక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియసుఖలోలుడైన వాడు పాపి. అట్టి వాని జీవితము వ్యర్థము.
17 వ శ్లోకం:--
యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః |
ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే ||
భావం:--
మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు. కనుక ఆత్మయందే తృప్తినొందును. అతడు ఆత్మయందే నిత్యసంతుష్టుడు. అట్టివానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు.
18 వ శ్లోకం:--
నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన |
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ||
భావం:--
అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుటవలన ప్రయోజనముగాని, చేయకుండుట వలనను దోషముగాని ఉండదు. అనగా సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగను లేదు.
19 వ శ్లోకం:--
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర |
అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః ||
భావం:--
అందువలన నీవు నిరంతరము ఫలాపేక్ష లేనివాడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఫలాపేక్ష వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును.
20 వ శ్లోకం:--
కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః |
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్కర్తుమర్హసి ||
భావం:--
జనకుడు మున్నగువారు ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుటవలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను చేయవలయును.

No comments:
Post a Comment