భగవద్గీత:---అథ తృతీయోஉధ్యాయః..కర్మయోగః..1 నుడి 10 శ్లోకాలు...
అర్జున ఉవాచ |
జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన |
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ||
భావం:--
అర్జునుడు పలికెను---ఓ జనార్ధనా ! కేశవా ! నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటెను జ్ఞానమే శ్రేష్టమైనచో, భయంకరమైన ఈ యుద్ధకార్యమునందు నన్నేల నియోగించుచున్నావు ?
2 వ శ్లోకం:--
వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోஉహమాప్నుయామ్ ||
భావం:--
కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు. కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెల్పుము.
3 వ శ్లోకం:--
శ్రీభగవానువాచ |
లోకేஉస్మింద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ |
ఙ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ||
భావం:--
శ్రీ భగవానుడు పలికెను--- ఓ అనఘా ! అర్జునా ! ఈ లోకమున రెండు నిష్టలు గలవని ఇంతకుముందే చెప్పియుంటిని . వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును.
4 వ శ్లోకం:--
న కర్మణామనారంభాన్నైష్కర్మ్యం పురుషోஉశ్నుతే |
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ||
భావం:--
మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగానిష్టాసిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్ఠను అతడు పొందజాలడు.
5 వ శ్లోకం:--
న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ |
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ||
భావం:--
ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము గూడ కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. ఏలనన మనుష్యులందరును ప్రకృతిజనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే యుండును.
6 వ శ్లోకం:--
కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ !
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే!ll
భావం:--ఎవడు, కర్మేంద్రియాణి - కర్మేంద్రియములను, సంయమ్య - బిగబట్టి, మనసా - మనస్సుచేతను, ఇంద్రియార్థాన్ - శబ్దాది విషయములను, స్మరన్ - స్మరించుచు, ఆస్తే - ఉండునో, సః - వాడు, విమూఢాత్మా - వివేకములేనివాడు, మిథ్యాచారః - కపటియును అని, ఉచ్యతే - చెప్పబడుచున్నాడు.
7 వ శ్లోకం:--
యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేஉర్జున |
కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే ||
భావం:--
కానీ అర్జునా ! మనస్సుతో ఇంద్రియములను వశపరచుకొని , అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచారణమును కావించు పురుషుడు శ్రేష్టుడు.
8 వ శ్లోకం:--
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ||
భావం:--
నీవు శాస్త్రవిహితకర్తవ్యకర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుటకంటెను చేయుటయే మేలుగదా! కర్మలను ఆచరింపనిచో నీ శరీరయాత్ర గూడ సిద్ధింపదు.
9 వ శ్లోకం:--
యఙ్ఞార్థాత్కర్మణోஉన్యత్ర లోకోஉయం కర్మబంధనః |
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ||
భావం:--
ఓ అర్జునా ! యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మ బంధములలో చిక్కుపడుదురు. కనుక ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్యకర్మలను చక్కగా ఆచరింపు.
10 వ శ్లోకం:--
సహయఙ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |
అనేన ప్రసవిష్యధ్వమేష వోஉస్త్విష్టకామధుక్ ||
భావం:--
కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగ ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధిచెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెల నెల్ల తీర్చునది అగుగాక అని పలికెను.

No comments:
Post a Comment