July 14, 2020

అథ షోడశోऽధ్యాయః 11 నుండి 20 వరకు శ్లోకాలు

అథ షోడశోऽధ్యాయః - దైవాసురసమ్పద్విభాగయోగః 11 నుండి 20 వరకు శ్లోకాలు 
11 వ శ్లోకం 
చింతామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః |
కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః || 

12 వ శ్లోకం  
ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః |
ఈహన్తే కామభోగార్థమ్ అన్యాయేనార్థసంచయాన్ || 


వాళ్ళు మృతిచెందేవరకూ వుండే మితిలేని చింతలతో కామభోగాలను అనుభవించడమే పరమావధిగా భావించి, అంతకు మించిందేదీ లేదని నమ్ముతారు. ఎన్నో ఆశాపాశాలలో చిక్కుకుని కామక్రోధాలకు వశులై విషయసుఖాలను అనుభవించడంకోసం అక్రమ ధనార్జనకు పూనుకుంటారు.
13 వ శ్లోకం 
ఇదమద్య మయా లబ్ధమ్ ఇమం ప్రాప్స్యే మనోరథమ్ |
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ||
14 వ శ్లోకం 
అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి |
ఈశ్వరో௨హమహం భోగీ సిద్ధో௨హం బలవాన్ సుఖీ ||
15 వ శ్లోకం 
ఆఢ్యో௨భిజనవానస్మి కో௨న్యో௨స్తి సదృశో మయా |
యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞానవిమోహితాః || 

16 వ శ్లోకం 
అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః |
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే௨శుచౌ || 
“ ఈవేళ నా కిది లభించింది. ఇక ఈ కోరిక నెరవేరుతుంది. నా కింత ఆస్తి వున్నది. మరింత సంపాదించబోతున్నాను. ఈ శత్రువును చంపేశాను. మిగిలిన శత్రువులను కూడ సంహరిస్తాను. నేను ప్రభువును, సుఖభోగిని, తలపెట్టినపని సాధించే సమర్థుణ్ణి, బలవంతుణ్ణి సుఖవంతుణ్ణి. నేను డబ్బున్న వాణ్ణి. ఉన్నత వంశంలో ఉద్భవించాను. నాకు సాటి అయిన వాడెవడూ లేడు. నేను యజ్ఞాలు చేస్తాను, దానాలిస్తాను, ఆనందం అనుభవిస్తాను.” అని వాళ్ళు అజ్ఞానంలో అనేకవిధాల కలవరిస్తారు. మోహవశులైన ఆ అసురస్వభావం కలిగినవాళ్ళు నిరంతరం కామభోగాలలోనే చిక్కుకుని చివరకు ఘోరనరకాల పాలవుతారు.
17 వ శ్లోకం 
ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః |
యజన్తే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్ || 
తమను తామే పొగడుకుంటూ, వినయ విధేయతలు లేకుండా, ధనమద గర్వంతో వాళ్ళు శాస్త్రవిరుద్ధంగా పేరుకు మాత్రం యజ్ఞాలు చేస్తారు.
18 వ శ్లోకం 
అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః |
మామాత్మపరదేహేషు ప్రద్విషన్తో௨భ్యసూయకాః || 
అహంకారం, బలం, గర్వం, కామం, క్రోధం –వీటిని ఆశ్రయించి అసూయాపరులైన వీళ్ళు తమ శరీరంలోనూ, ఇతరుల శరీరాలలోనూ వుంటున్న నన్ను ద్వేషిస్తారు.
19 వ శ్లోకం 
తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ |
క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు || 
ద్వేషపూరితులు, పాపచరితులు, క్రూరస్వభావులు అయిన అలాంటి మానవాధములను మళ్ళీ మళ్ళీ సంసారంలోనే పడవేస్తుంటాను.
20 వ శ్లోకం 
ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని |
మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిమ్ || 


కౌంతేయా! అసురజన్మ పొందే అలాంటి మూర్ఖులు ఏ జన్మలోనూ నన్ను చేరలేకపోవడమే కాకుండా అంతకంతకీ అధోగతి పాలవుతారు.
21 వ శ్లోకం 
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః |
కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్ || 


కామం, క్రోధం, లోభం –ఈ నరక ద్వారాలు మూడూ ఆత్మవినాశానికి కారణాలు. అందువల్ల ఈ మూడింటినీ విడిచిపెట్టాలి.
22 వ శ్లోకం 
ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైఃత్రిభిర్నరః |
ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిమ్ || 
కౌంతేయా! ఈ మూడు దుర్గుణాలనూ విసర్జించినవాడు తనకు తాను మేలు చేసుకుని పరమపదం పొందుతాడు.
23 వ శ్లోకం 
యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః |
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ || 

శాస్త్రవిధులను విడిచిపెట్టి తన ఇష్టానుసారం ప్రవర్తించేవాడు తత్వజ్ఞానంకాని, సుఖంకాని, మోక్షంకాని పొందడు.
24 వ శ్లోకం 
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ |
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి || 
అందువల్ల చేయదగ్గదేదో, చేయకూడనిదేదో నిర్ణయించుకోవడంలో నీకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్రవిధానాలను తెలుసుకుని తదనుగుణంగా ఈ లోకంలో నీవు కర్మలు చేయాలి.
ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "దైవాసురసంపద్విభాగయోగము" అనే పదునారవ అధ్యాయం సమాప్తం.

No comments:

Post a Comment