December 10, 2016

అథ షోడశోऽధ్యాయః -1 నుండి 10 వరకు శ్లోకాలు

అథ షోడశోऽధ్యాయః - దైవాసురసమ్పద్విభాగయోగః 1 నుండి 10 వరకు శ్లోకాలు 

శ్రీభగవానువాచ|
అభయం సత్త్వసంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థితిః|
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్||
వ శ్లోకం 
అహింసా సత్యమక్రోధస్త్యాగః శాన్తిరపైశునమ్|
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్||
వ శ్లోకం 
తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా|
భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత||
భావం 
ఓ అర్జునా ! 1. భయము లేకుండుట 2. అంతఃకరణశుద్ధి 3. జ్ఞానయోగమునందుండుట 4.దానము 5.బాహ్యేంద్రియనిగ్రహము 6. (జ్ఞాన) యజ్ఞము 7.( వేదశాస్త్రముల ) అధ్యయనము 8.తపస్సు 9.ఋజుత్వము 10.ఏప్రాణికిన్ని బాధ గలుగజేయకుండుట ( అహింస ) 11. సద్వస్తువగు పరమాత్మ నాశ్రయించుట, లేక , నిజము పలుకుట (సత్యము), 12.కోపము లేకుండుట 13.త్యాగబుద్ధిగలిగియుండుట 14. శాంతిస్వభావము 15.కొండెములు చెప్పకుండుట 16. ప్రాణులందు దయగలిగియుండుట 17.విషయలోలత్వము లేకుండుట 18.మృదుత్వము (క్రౌర్యము లేకుండుట) 19. (ధర్మ విరుద్ధ కార్యములందు) సిగ్గు 20.చంచల స్వభావము లేకుండుట 21.ప్రతిభ (లేక, బ్రహ్మతేజస్సు )22. ఓర్పు(కష్ట సహిష్ణుత) 23. ధైర్యము 24.బాహ్యాభ్యంతర శుచిత్వము 25.ఎవరికిని ద్రోహముచేయకుండుట (ద్రోహచింతనము లేకుండుట) 26. స్వాతిశయము లేకుండుట (తాను పూజింపదగినవాడనను అభిమానము, గర్వము లేకుండుట) - అను నీ సుగుణములు దైవసంపత్తియందు పుట్టిన వానికి కలుగుచున్నది . (అనగా దైవసంపత్తిని పొందదగి పుట్టినవానికి కలుగుచున్నవని భావము).

వ శ్లోకం 
దమ్భో దర్పోऽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ|
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్||
భావం 
ఓ అర్జునా ! డంబము, గర్వము, అభిమానము (దురభిమానము), కోపము, (వాక్కు మున్నగు వాని యందు)కాఠిన్యము, అవివేకము అను నీ దుర్గుణములు అసురసంపత్తియందు పుట్టినవానికి కలుగుచున్నవి .(అనగా అసురసంపత్తిని పొందదగి జన్మించినవానికి కలుగుచున్నవని భావము).  


వ శ్లోకం 
దైవీ సమ్పద్విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా|
మా శుచః సమ్పదం దైవీమభిజాతోऽసి పాణ్డవ||
భావం 


ఓ అర్జునా ! దైవీసంపద పరిపూర్ణ (సంసార) బంధనివృత్తిని ; అసురీసంపద గొప్ప (సంసార) బంధమును గలుగ జేయునని నిశ్చయింపబడినది. నీవు దైవీసంపదయందే (దైవీసంపదను పొందదగియే) జన్మించినాడవు కావున శోకింపనవసరము లేదు. 


వ శ్లోకం 
ద్వౌ భూతసర్గౌ లోకేऽస్మిన్దైవ ఆసుర ఏవ చ|
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు||
భావం 


ఓ అర్జునా ! ఈ ప్రపంచమున దైవసంబంధమైన గుణము కలది యని, అసురసంబంధమైన గుణము కలదియని రెండు విధములగు ప్రాణులు సృష్టులు కలవు . అందు దైవసంబంధమైన దానినిగూర్చి నీకు విస్తరముగ తెలిపితిని. ఇక అసురసంబంధమైన దానిని గూర్చి నావలన వినుము .

వ శ్లోకం 
ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః|
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే||
భావం 
అసుర స్వభావముగల జనులు ధర్మ ప్రవృత్తినిగాని అధర్మప్రవృత్తినిగాని యెఱుంగరు. వారియందు శుచిత్వముగాని ఆచారము(సత్కర్మాచారము) గాని సత్యముగాని యుండదు. 

వ శ్లోకం 
అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్|
అపరస్పరసమ్భూతం కిమన్యత్కామహైతుకమ్||
భావం 
వారు జగత్తు అసత్యమనియు (వేదాది ప్రమాణ రహితమనియు) , ప్రతిష్ఠ (ధర్మాధర్మవ్యవస్థలు) లేనిదనియు, (కర్తయగు ) ఈశ్వరుడు లేనిదనియు, కామమే హేతువుగా గలదై స్త్రీపురుషుల యొక్క పరస్పర సంబంధము చేతనే కలిగినదనియు, అదిగాక ఈ జగత్తునకు వేఱుకారణమేమియు లేదనియు చెప్పుదురు .


వ శ్లోకం 
ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోऽల్పబుద్ధయః|
ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతోऽహితాః||
భావం 
(వారు) ఇట్టి నాస్తిక దృష్టిని అవలంబించి , చెడిన మనస్సు గలవారును , అల్పబుద్ధితో గూడియున్నవారును , క్రూరకార్యములను జేయువారును , (జగత్తునకు) శత్రువులును (లోకకంటకులును) అయి ప్రపంచముయొక్క వినాశము కొఱకు పుట్టుచున్నారు .

10 వ శ్లోకం 
కామమాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితాః|
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ప్రవర్తన్తేऽశుచివ్రతాః||
భావం 
వారు తనివి తీరని కామము నాశ్రయించి, డంబము, అభిమానము, మదము గలవారై, అవివేకము వలన చెడు పట్టుదలల నాశ్రయించి, అపవిత్రములగు వ్రతములు (నీచ వృత్తులు) గలవారై ప్రవర్తించుచున్నారు. 

No comments:

Post a Comment