April 27, 2013

అథ ప్రథమో‌உధ్యాయః--1 నుండి 10 శ్లోకాలు..(అర్జున విషాదయోగము)

శ్రీమద్భగవద్గీత
రచన: వేదవ్యాస మహర్షి
మానవజీవితమును సుసంయతమొనర్చి, దానిని భగవత్ అనుగ్రహముగా చేయుట వలననే జీవితము సార్థకమగునని మన భారతీయసంస్కృతి చెప్పుచున్నది. అశాశ్వతమైన, క్షణికమైన ఈ జీవితమును ఉద్దరింపచేసి, శాశ్వతమైన, అపరిమితమైన , పరమపదము.... (దేవుని చేరుకొనుటయే) మన భారతీయుల దృష్టిలో మానవజన్మ యొక్క సార్థకత ఏకైక లక్ష్యము. అటువంటి లక్ష్యప్రాప్తికి సర్వోత్క్రుష్ణ సాధనము భగవద్గీత మాత్రమే. 
భగవద్గీత సాక్షాత్తు భగవానుడు శ్రీకృష్ణభగవానుని దివ్యవాణి. దీని మహిమ అపారమైనది. అపరితమైనది. మనం వర్ణించలేనిది. దీని గూర్చి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి మహత్తరగ్రంథం నుండి మనం ప్రతీరోజు కొన్ని శ్లోకములు నేర్చుకుందాము.
అథ ప్రథమో‌உధ్యాయః| అర్జున విషాదయోగః ....1 నుండి 10 శ్లోకాలు.  
ధృతరాష్ట్ర ఉవాచ |
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయll     

భావం:--
ధృతరాష్ట్రుడు ఇలా పలికెను--- ఓ సంజయా ! యుద్ధమునకు సిద్ధమై, ధర్మక్షేత్రమునకు చేరిన నా కుమారులను, పాండు పుత్రులను ఏమి చేసినావు ?

2 వ శ్లోకం 
సంజయ ఉవాచ |
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ll

భావం:--
సంజయుడు ఈ విధంగా పలికెను.....ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో, యుద్ధమునకు సిద్ధమై, పాండవ సైన్యమును చూసి, ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఈ విధంగా పలికెను.
3 వ శ్లోకం
పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ll

భావం:--
ఓ ఆచార్యా !బుద్ధిమంతుడైన మీ శిష్యుడును, ధ్రువపుత్రుడైన ధృష్టద్యుమ్నునిచే వ్యుహాత్మకముగా నిల్పబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుము......
వ శ్లోకం:-- 
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||
భావం:--

ఆచార్యా ! ఈ పాండవ సేనలో ఎందరో వీరులున్నారో! వారందరూ గొప్ప విలుకాండ్రు, భీమునంత బలము, అర్జునితో సరితూగు పరాక్రమము కలవారే. వారు ఎవరు అంటే శ్రీకృష్ణుని కుమారుడగు సాత్యకి, పాండవులను కాపాడిన విరాటరాజు, ద్రౌపది తండ్రి, మహారథి కొడుకు ద్రుపదుడు ఇంకా....     
5 వ శ్లోకం:--
ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||

భావం:--
ఆచార్యా ! ఇంకా దృష్టకేతువు, చేకితానుడు, మిక్కిలి పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజితుడు, కుంతిభోజుడు, పురుష శ్రేష్ఠ్తుడైన శైబ్యుడు యుద్ధములో నిలిచియున్నారు చూడు.       
వ శ్లోకం:--
యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః 
||
భావం:--
యుధామన్యుడిని మించిన వీరుడు లేడు. ఉత్తమౌజుడు గొప్ప పరాక్రమశాలి. అభిమన్యుని సంగతి చెప్పనవసరం లేదు. ద్రౌపది కుమారులగు ప్రతివింద్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనులు సరేసరి. అసలు వీరందరూ కూడా మహారథులై యుద్ధరంగంలో నిలచియున్నారు చూడు.    
7 వ శ్లోకం:--
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంఙ్ఞార్థం తాన్బ్రవీమి తే ||

భావం:--
బ్రాహ్మణోత్తముడవగు ఓ ద్రోణాచార్యా ! మన పక్షముననున్న ప్రధాన యోధులను గూడా గమనింపుము. మీ ఎరుకకై మన సేనానయకులను గూర్చియు తెలుపుచున్నాను.

8 వ శ్లోకం:--
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ ||

భావం:--
మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామవిజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సొమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు.


9 వ శ్లోకం:--
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః ||

భావం:--
ఇంకా ఎక్కువమంది శూరులను, వీరులను మన సైన్యమునందు ఉన్నారు. యుద్ధవిశారదులు, నానాశస్త్రాస్త్రధారులు, నా కొరకు తమ ప్రాణముల నొడ్డియైనను యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నవారు.

10 వ శ్లోకం:--
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||

భావం:--
భీష్మపితామహునిచే సురక్షితము, అపరిమితముగా ఉన్న, మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితంగా ఉన్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము.


No comments:

Post a Comment